Site icon Prime9

Food Poisoning: తెలంగాణలో మరోసారి ఫుడ్ పాయిజన్.. అస్వస్థతకు గురైన గురుకుల బాలికలు

Gurukul Girl Students Fall ill at Jagtial: తెలంగాణలో మరోసారి ఫుడ్ పాయిజన్ చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా సారంగపాడు కస్తూర్బాగాంధీ పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు వెంటనే అస్వస్థతకు గురైన బాలికలను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికలకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం… ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత కొంతమంది బాలికలు అస్వస్థకు గురయ్యారని తెలుస్తోంది. కస్తూర్బా పాఠశాలలో ఆహారం తిని విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైనట్లు తోటి విద్యార్థులు తెలిపారు. దీంతో వెంటనే పాఠశాల సిబ్బంది అప్రమత్తమైంది. హుటాహుటిన విద్యార్థులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో గత కొంతకాలంగా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల నారాయణపేట జిల్లాలోని మాగనూరులో ఫుడ్ పాయిజన్ చోటుచేసుకుంది. ఈ ఘటనలలో దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అదే విధంగా మంగళవారం వికారాబాద్ జిల్లాలోని తాండూరు గిరిజన బాలికల హాస్టల్‌లో కూడా ఉడకని కిచిడీ తిని 16 మంది బాలికలు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు.

మొత్తం 160 మంది బాలికలు ఉండగా, ఉదయం 8 గంటలకు హాస్టల్‌లో కిచిడీ తిన్నారు. తర్వాత 10 గంటల సమయంలో 9మంది విద్యార్థులకు కడుపునొప్పి వచ్చిందని సిబ్బందికి తెలియజేశారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. సాయంత్రం 5 గంటల సమయంలో మరో ఏడుగురికి వాంతులు చేసుకోవడంతో వారిని మాతా, శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారన్నారు.

Exit mobile version