Site icon Prime9

Bathukamma: సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు…సీఎం కేసిఆర్

Greetings from Saddula Bathukamma...CM KCR

Greetings from Saddula Bathukamma...CM KCR

CM KCR: తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ చివరిరోజు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలను సీఎం కేసిఆర్ తెలియచేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రజలందరికి అభినందనలు తెలిపారు.

రాష్ట్ర ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో తులతూగాలని దుర్గామాతను ప్రార్ధించారు. బతుకమ్మ 9రోజుల వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులు, ప్రజలకు కృతజ్నతలు తెలిపారు. బతుకమ్మ పండుగ విశిష్టతను తెలుపుతూ చేపట్టిన కార్యక్రమాల్లో జానపదులు, నృత్యాలతో అలరించడంపై ఆనందం వ్యక్తం చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా గడిచిన 9రోజులుగా సాంస్కృతిక వాతావరణం ఆవరించిడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పల్లెల్లో సమృద్ధిగా నీరు, పచ్చని వ్యవసాయ పొలాలతో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణాలో బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగా ప్రభుత్వం నిర్వహిస్తుందని, ఇందుకోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన్నట్లు సీఎం కేసిఆర్ పేర్కొన్నారు.

Exit mobile version