Grandhi Srinivas Resign YSRCP Party: వైఎస్ జగన్‌కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేతలు రాజీనామా బాట పట్టారు. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా, మరో షార్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన కాసేపటికే మరో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేశాడు. ఈ మేరకు ఆయన పార్టీని వీడినట్లు ప్రకటించాడు. వైసీపీ ప్రాథహిక సభ్యంతో పాటు ఆ పార్టీ పదవులకు సైతం వీడినట్లు చెప్పారు. అనంతరం ఆ రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు. దీంతో వైసీపీ నాయకుల్లో ఆందోళన నెలకొంది.
అయితే, గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను సైతం గ్రంథి శ్రీనివాస్ ఓడించిన చరిత్ర ఉంది. అంతకుముందు ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేయగా.. పవన్ కల్యాణ్‌పై గెలుపొందారు. దీంతో గ్రంధి శ్రీనివాస్ పేరు ఒక్కసారిగా మార్మోగింది. అప్పటినుంచి ఆయనకు పార్టీలో జెయింట్ కిల్లర్ గా పేరు పడింది. అయితే, 2024 ఎన్నికల్లో గ్రంధి శ్రీనివాస్ ఘోర ఓటమి చవిచూశారు. జనసేన అభ్యర్థి పులవర్తి రామాంజనేయులు చేతిలో ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన వైసీపీ నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే అతను ఏ పార్టీలో చేరుతారనే విషయంపై సస్పెన్స్ నెలకొంది.