Site icon Prime9

Credit cards: క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్

credit card

credit card

Credit cards: ఈ రోజుల్లో చాలా మంది ఒకటికి మించి ఎక్కువ క్రెడిట్ కార్డు వాడుతున్నారు. అలాంటివారికి ఎన్‌పీసీఐ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రూపే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వినియోగదారుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరో కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. అదేంటో ఓసారి తెలుసుకుందాం.

గుడ్ న్యూస్ ఇదే.. (Credit cards)

ఈ రోజుల్లా చాలా మంది ఒకటికి మించి ఎక్కువ క్రెడిట్ కార్డు వాడుతున్నారు. అలాంటివారికి ఎన్‌పీసీఐ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రూపే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వినియోగదారుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరో కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. అదేంటో ఓసారి తెలుసుకుందాం.

ఇకపై కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ- సీవీవీ లేకుండానే లావాదేవీలు పూర్తి చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది.

టోకనైజ్డ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ప్రీపెయిడ్ కార్డ్ హోల్డర్‌లు ఈ సదుపాయాన్ని వ్యాపారి యాప్‌లలో లేదా వెబ్ పేజీలో పొందవచ్చు.

దీని వల్ల.. మనం ఏదైనా కొనుగోలు చేసే సమయంలో.. కార్డు వివరాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. దీంతో పాటు.. వ్యాలెట్ ను ఆశ్రయించాల్సిన పని కూడా లేదు.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ వంటి యాప్‌ల ద్వారా కొనుగోళ్లకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వివరాలను నమోదు చేయాలి.

మొదటిసారి కొనుగోలు చేసేవారు కార్డ్ నంబర్, గడువు తేదీ, సీవీవీ, ఓటీపీని నమోదు చేయడం ద్వారా లావాదేవీని పూర్తి చేయాలి.

ఆ వివరాలు ఆయా కంపెనీల వద్ద ఉండేవి. ఏదైనా సైబర్ దాడి జరిగితే ఈ వివరాలు బహిర్గతమయ్యే ప్రమాదం ఉన్నందున ఆర్బీఐ టోకనైజేషన్‌ను ప్రవేశపెట్టింది.

ఇలాంటి సందర్భంలో.. ఒకేసారి సీవీవీ, ఓటీపీని నమోదు చేసి కార్డు టోకనైజేషన్ పూర్తి చేస్తే ప్రతీసారి కార్డ్ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేదన్న మాట.

ప్రస్తుతానికి టోకనైజ్ చేసిన వారు వారి లావాదేవీలను పూర్తి చేయడానికి సీవీవీ- ఓటీపీని నమోదు చేయాలి.

రానీ రూపే కార్డు వినియోగదారులు మాత్రం ఇక అలా సీవీవీ ని నమోదు చేయాల్సిన అవసరం లేదు.

రూపే అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన దేశీయ కార్డ్ నెట్‌వర్క్. దీని వినియోగాన్ని పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు.

Exit mobile version