Formula E race: ఫార్ములా- ఈ కారు రేసులో కీలక పరిణామం.. కేటీఆర్‌కు సమన్లు!

Formula-Car Race Case: ఫార్ములా- ఈ కారు రేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు, ఐఏఎస్ అధికారి దాన కిశోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేసుకున్నారు. దాన కిశోర్ స్టేట్ మెంట్ ఆధారంగా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ మేరకు సుమారు 7 గంటలపాటు స్టేట్ మెంట్ రికార్డు కొనసాగించి కీలక వివరాలను సేకరించింది.

కాగా, ఈ కారు రేసు విషయంపై ఇటీవల దాన కిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే విచారించారు. ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా అరవింద్ కుమార్‌కు ఏసీబీ సమన్లు ఇవ్వనుంది.

ఇదిలా ఉండగా, ఫార్ములా- ఈ కారు రేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రిన్సిపల్ సెకరెట్రీగా ఉన్నటువంటి దానకిశోర్ స్టేట్ మెంట్‌ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. ఆయన స్టేట్ మెంట్ ఆధారంగానే ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్, ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌తో పాటు బీఎల్ రెడ్డికి కూడా సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. ఇందులో కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.