Site icon Prime9

AP Rains: ఏపీలో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

Floods Effect To AP Due To Heavy Rains By Fengal Cyclone: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫెంగల్ తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. విశాఖతోపాటు శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కోనసీమ, అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా ఏర్పడడంతో మరో 24 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ వర్షానికి వరద పోటెత్తడంతో తిరుమలలోని గోగర్భం జలాశయం నుంచి రెండు గేట్లు ఎత్తివేశారు. దీంతో దిగువకు నీళ్లు భారీగా వస్తున్నాయి. మరోవైపు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమలలోని ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. టీటీడీ సిబ్బంది చొరవ తీసుకొని జేసీబీల సహాయంతో ఎప్పటికప్పుడు కొండచరియలను తొలగిస్తున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

దీంతో పాటు కుమారధార, పసుపుధార, పావినాశనం, ఆకాశగంగ వంటి జలాశయాల్లో పూర్తిస్థాయికి నీటిమట్టం చేరింది. అలాగే ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం వద్ద సముద్రతీరం భయంకరంగా మారింది. దీంతో సముద్ర తీరప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఈ సమయంలో ఎవరూ బయటకు వెళ్లవద్దని హెచ్చరకలు జారీ చేశారు. ఈ వర్షాల కారణంగా విశాఖ నుంచి తిరుపతి వెళ్లే రైలుతో పాటు విశాఖ నుంచి చెన్నై వెళ్లాల్సిన విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.

Exit mobile version