Site icon Prime9

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్.. రైతులను దగా చేసి విజయోత్సవాలా?

Ex Minister Harish Rao Sensational Comments On CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన విజయోత్సవాలపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను దగా చేసి పండుగ పేరిట విజయోత్సవాలా అని సీఎంను ప్రశ్నించారు. ఏడాది పాలనలో 563 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినందుకు పండుగ చేస్తున్నావా అని మండిపడ్డారు. వరంగల్ రైతు డిక్లరేషన్ హామీలు అమలు చేయనందుకు ఉత్సవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు సంక్షేమానికి రూ.54,280 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం..
ఏడాది పాలనలో రైతు సంక్షేమం కోసం రూ.54,280 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. రైతుబీమా, ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోళ్ల కోసం రూ. 27,486 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అవి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని తెలిపారు. రుణమాఫీ కింద 14,000 కోట్లు, వానకాలం రైతు బంధు కింద 7,500 కోట్లు, కౌలు రైతులకు మరో 3,000 కోట్లు, రైతు కూలీలకు 1600 కోట్లు, అన్ని పంటలకు బోనస్ సుమారు 3,000 కోట్లు, అకాల వర్షాలకు పంట నష్టం సుమారు 11,700 కోట్లు (కేంద్రానికి రాష్ట్రం పంపిన రిపోర్టు అన్నారు. ఏడాది కాలంలో మొత్తం రూ. 40,800 కోట్లు రైతులకు బాకీ పడ్డారని హరీశ్‌రావు తెలిపారు. రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతులకు బాకీ పడ్డ రూ. 40,800 కోట్లతోపాటు, యాసంగికి ఇవ్వాల్సిన రైతు భరోసా విడుదల చేసి పండుగ చేసుకోవాలని డిమాండ్ చేశారు.

Exit mobile version