Akunuri Murali: వాహనాల తనిఖీల్లో భాగంగా భుపాలపల్లి ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ద్విచక్ర వాహనదారుడిపై అధికారం అడ్డం పెట్టుకొని చేయి చేసుకున్నాడు. ఇది చూసిన మాజీ ఐఏఎస్ అధికారి సదరు ఎస్ఐని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఐ రామకృష్ణ వాహనాలను తనిఖీ చేస్తూ ఒక వాహనదారుడిపై అత్యుత్సాహంతో చేయి చేసుకున్నాడు.
గతంలో ఈ జిల్లా కలెక్టర్ గా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్న మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి అటుగా వెళుతున్నారు.
ఈ ఘటనను స్వయంగా చూసి అక్కడే ఆగారు. దీంతో బాధితుడు మాజీ కలెక్టర్‌కు తన గోడు వినిపించాడు. దీంతో మాజీ కలెక్టర్ సదర్ ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాహనాల తనిఖీ చేయడం డ్యూటీలో భాగం కావచ్చు ఇలా చేయి చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.
మాజీ కలెక్టర్ ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలో తెలియక.. ఎస్ఐ అక్కడి నుంచి
తప్పుకునే ప్రయత్నం చేశారు. ఎస్ఐ తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేశారు మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి.
మాజీ కలెక్టర్ చేయి అడ్డుపెట్టినప్పటికీ.. ఆ ఎస్ఐ తన వాహనమెక్కి వెళ్లి పోయారు.
ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
ఎస్ఐ ని నిలదీసిన జిల్లా మాజీ కలెక్టర్ మురళి (Akunuri Murali).
సోషల్ మీడియాలో వీడియో వైరల్.
వాహనాల తనిఖీలలో ద్విచక్ర వాహన దారుడిపై చేయి చేసుకున్న ఎస్ఐ.
మాజీ ఐఏఎస్ తీరుపై ప్రశంసలు.
చేయి చేసుకున్న ఎస్ఐ పెరుగుతున్న విమర్శలు.
జిల్లా వ్యాప్తంగా వైరల్ అవుతున్న వీడియో.
ఎస్ఐ తీరుపై జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న నిరసన.
ఎస్ఐ తీరును తప్పుపడుతున్న జిల్లా ప్రజలు, అధికారులు.
మాజీ కలెక్టర్ కు తన గోడు వివరించిన బాధితుడు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/