Heavy Rains in telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
బంగాళాఖాతం వద్ద సముద్ర మట్టానికి 1.5కి.మీ ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం ఏపీ తీరానికి దగ్గరగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ ప్రభావంతో రానున్న మూడు రోజులు హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సిద్ధిపేట, జనగాం, భువనగిరి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లొద్దని సూచించారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ెలిపింది.
ాగా, ఇప్పటిక తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీవర్షం కురవగా.. ఏపీలోని రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి.