Site icon Prime9

Donald Trump: అగ్రపీఠం ‘ఆయన’దే.. రికార్డు సృష్టించిన డొనాల్డ్‌ ట్రంప్‌

Donald Trump wins US elections: అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ప్రజా తీర్పు ముందు సర్వేలన్నీ మరోసారి బోర్లా పడ్డాయి. ‘తెంపరి’గా పేరొందిన నాయకుడే.. అభిమానుల మనసు చూరగొని, అమెరికా అధ్యక్షడిగా మరోసారి నియమితులయ్యారు. నాలుగేళ్ల విరామం తరువాత ఎన్నికైన అధ్యక్షుడిగా దాదాపు 181 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. ఉపాధ్యక్షుడిగా తెలుగు వారి ఇంటి అల్లుడు జేడా వాన్స్‌ నియమితులయ్యారు. ప్రధాని నరేంంద్రమోదీ – ట్రంప్‌ మధ్య ఉన్న సత్సంబంధాలు సైతం మన దేశానికి ప్రయోజనం కలిగించనున్నాయి.

ప్రపంచ పెద్దన్నగా పేరుగాంచిన అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఎన్నికయ్యారు. పాపులర్‌ ఓట్లతో పాటు సెనటర్లను కూడగట్టుకుని, భారీ విజయాన్ని అందుకున్నారు. డెమెక్రటిక్‌ పార్టీ తరపున అధ్యక్షురాలిగా పోటీ చేసిన భారత సంతతి మహిళ కమలా హారిష్‌ ను భారీ మెజార్టీతో మట్టి కరిపించారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి జరిగిన ఓటింగ్‌ మొదలు.. తుది కౌంటింగ్‌ వరకు ఆద్యంతం ఆయన హవానే కనిపించింది. ఈ సందర్భంగా ట్రంప్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి, 50.9శాతం మెజార్టీతో 7,18,07,600 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. ఇదే సమయంలో కమలా 47.4 శాతంతో 6,69,25,181 ఓట్లకే పరిమితమయ్యారు. రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారులు 294మంది విజయం సాధించగా, డెమెక్రటిక్‌ తరపున పోటీ చేసిన వారిలో 223 మంది విజయం సాధించారు. ఫ్లోరిడాలో మద్దతుదారుల ఆనందోత్సాహాల నడుమ ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. భార్య మెలానియా ట్రంప్, సహచరుడు జేడీ వాన్స్‌తో పాటు ప్రచార సిబ్బందితో సహా వేదికపైకి వచ్చారు. అందరూ వేదికపైకి వచ్చిన తర్వాత ఆయన ప్రసంగం ప్రారంభించారు. రాజకీయ విజయంగా ఆయన దీనిని అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడిగా తనకు మరో అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘అమెరికా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మేం దేశ పునర్నిర్మాణానికి కృషి చేస్తాం’ అని అన్నారు.

స్వింగ్‌ ఎటు..?
అమెరికా ఎన్నికల్లో గెలుపును ప్రభావితం చేసే కీలక రాష్ట్రాలను స్వింగ్‌ రాష్ట్రాలుగా పిలుస్తారు. ఈ రాష్ట్రాలన్నిటిలో విజయ దుందుభి మోగించిన టంప్‌.. తన విజయానికి బాటలు వేసుకున్నారు. పెన్సిల్వేనియాలో 4 లక్షల ఓట్ల మెజార్టీతో పాటు 19 ఎలక్టోరల్‌ ఓట్లు దక్కించుకున్నారు. జార్జియాలో లక్షా 10వేల ఓట్ల మెజార్జీ, 16 ఎలక్షోరల్‌ ఓట్లు, నార్త్‌ కరోలినాలో 2 లక్షలకు పైగా వ్యత్యాసంతో పాటు 16 ఎలక్షోరల్‌ ఓట్లు తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే విస్కాన్సిన్‌, మిషిగన్‌, ఆరిజోనా, నెవడా రాష్ట్రాల్లో తన హవా కొనసాగించి, తన విజయానికి మార్గం చేసుకున్నారు.

మహిళ లకే అవకాశమే లేదా..!
లింగ వివక్షపై ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే దేశం అమెరికా. కానీ.. దాదాపు 250 ఏళ్ల అమెరికా అధ్యక్షుల్లో ఇప్పటి వరకు ఒక్కరు కూడా మహిళ లేకపోవడం గమనార్హం, 2016లో ట్రంప్‌ చేతిలో హిల్లరీ క్లింటన్‌ పరాజయం చూసినట్లే.. ప్రస్తుత ఎన్నికల్లో కూడా డెమకటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిష్‌ ఓటమి పాలయ్యారు. ఎన్నో పోరాటాల అనంతరం 1920 నుంచి దాదాపు వందేళ్లకు చేరగా మహిళలకు ఓటు హక్కు దక్కినా… తమ స్వరాన్ని వినిపించే వారిని ఎన్నుకోలేక పోతున్నారు.

కీలకంగా మారిన భారతీయులు…
డెమెక్రటిక్‌ తరపున భారత మూలాలున్న కమలా హారీష్‌ పోటీ చేయడంతో పాటు రిపబ్లికన్‌ తరపున ట్రంప్‌కు ప్రధాన మద్దతుదారు, ఉపాధ్యక్షుడిగా బరిలో నిలిచిన జేడీ వాన్స్‌ తెలుగింటి అల్లుడు కావడం విశేషం. అమెరికా సెకెండ్‌ లెడీగా నిలిచిన తెలుగమ్మాయి ఉషా చిలుకూరి భర్త వాన్స్‌.. ఒహాయా రాష్ట్ర నుంచి సెనెటర్‌ గా వ్యవహరిస్తున్నారు. కృష్ణా జిల్లా పామర్రు సమీపంలోని ఓ గ్రామం ఉషా చిలుకూరి స్వస్థలం. ఆమె తల్లిదండ్రులు 1980 ల్లోనే ఉన్నత ఉద్యోగాల నిమిత్తం అమెరికాకు వలస వెళ్లారు. యేల్‌ లా స్కూల్‌ లో చదువుకుంటున్న సమయంలో ఉషా – వాన్స్‌ మధ్య ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారి, పరిణయానికి దారి తీసింది. మరోవైపు భారత్‌ సంతతి వారు వివిధ ప్రాంతాల్లో సెనెటర్లుగా పోటీ చేయగా, మొత్తం ఆరుగురు గెలుపొందారు. వారిలో… యా కాలిఫోర్నియాలోని 6వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి డాక్టర్‌ అమిబెరా(59) వరుసగా 7వ సారి ఇక్కడి నుంచి బరిలో నిలిచి, విజయం సాధించారు.

ఆ ఒక్క రోజే అంతా మారింది..!!
జూలై 14న పెన్సిల్వేయాలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న సమయంలో ట్రంప్ పై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపిన ఘటన.. అమెరికాను ఊపిసింది. ఫైట్.. ఫైట్.. ఫైట్ అంటూ అరుస్తూ ఆయన పిడికిలి బిగించి, తనలోని ధైర్యాన్ని చాటి చెప్పారు. ఈ ఒక్క ఘటన అమెరికా ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేసింది. లక్షలాది మంది అమెరికన్లు ఆయనకు ఓటేసి రెండోసారి అధ్యక్షుడయ్యే అవకాశం ఇచ్చారు. ఈసారి జరిగిన ఎన్నికల ప్రచారం చరిత్ర పుస్తకాల్లో నిలిచిపోతుంది. రెండుసార్లు హత్యాయత్నాల నుంచి బయటపడటం ఒక ఎత్తు అయితే .. తన ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కేవలం నెల రోజుల ముందు పోటీ నుంచి తప్పుకోవడం మరో ప్రత్యేక సందర్భం. ఓట్ల తుది లెక్కింపు ఇంకా జరుగుతున్నప్పటికీ కీలకమైన బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్‌లో మెజారిటీ అమెరికన్లు ఆర్థిక వ్యవస్థ, ఇమిగ్రేషన్ అంశాలనే ప్రధానంగా చూస్తూ ఆయనకే మద్దతునిచ్చారు. అమెరికా ఫస్ట్ అనేది ట్రంప్ చెప్పే మరో నినాదం. అది ఓటర్లను బాగా ఆకట్టుకుంది. యుక్రెయిన్‌కు వందల కోట్ల డాలర్లు సాయంగా అందించడంపై పార్టీలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడాన్ని నేను గమనించాను. ఆ డబ్బంతా తమ దేశం కోసమే ఖర్చుపెట్టి ఉంటే బాగుండేదని వారి అభిప్రాయం. చివరకు, వాళ్లు బైడెన్ ప్రభుత్వంలో నాలుగేళ్ల పాటు ఉపాధ్యక్షురాలిగా ఉన్న హారిస్‌కు ఓటెయ్యలేదు. బైడెన్ స్థానంలో హారిస్ అధ్యక్షురాలైనా పరిస్థితి ఇలానే ఉంటుందని వాళ్లు భావించారు. మార్పు కోరుకున్నారు.

మోదీ శుభాకాంక్షలు..
‘మిత్రుడు డోనల్డ్ ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు. మునుపటి మీ పాలన తరహాలో, మీ సహకారంతో భారత్ – అమెరికా సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం కోసం ఎదురుచూస్తున్నా. ఇరుదేశాల ప్రజల అభివృద్ధి, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దాం’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘చారిత్రాత్మక పునరాగమనానికి శుభాకాంక్షలు. మీరు వైట్‌హౌస్‌కి తిరిగిరావడం అమెరికాకు నూతన అధ్యాయం, ఇజ్రాయెల్ – అమెరికా కూటమిని మరింత శక్తివంతం చేస్తుంది’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. డోనల్డ్ ట్రంప్‌కు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ శుభాకాంక్షలు తెలిపారు. రానున్న సంవత్సరాల్లో మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని స్టార్మర్ అన్నారు.

Exit mobile version