Deputy CM Pawan Kalyan meeting delhi ended: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ మేరకు దాదాపు 30 నిమిషాలపాటు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా జల్ జీవన్ మిషన్ అమలుతో పాటు టూరిజం పాలసీ, ఎర్ర చందనం, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ మూడు రోజుల పర్యటనపై కూటమి శ్రేణులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఈ పర్యటన విజయవంతమైంది. ఢిల్లీ నుంచి విమానంలో పవన్ కల్యాణ్ ఏపీకి బయలుదేరారు. కాగా, ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉన్నారు. టూరిజం, ఆర్థిక వెసులుబాటు, అటవీ శాఖ, పర్యావరణం వంటి అంశాలపై కేంద్రంతో చర్చలు జరిపారు. అలాగే దీంతో పాటు పలు రాజకీయ అంశాలపై ఎన్డీఏ పెద్దలతో చర్చించారు.
24 గంటల్లో కేంద్రంలోని 10 మంది ముఖ్యులతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఆర్థిక, జలవనరుల, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, రైల్వే, టూరిజం, అటవీ శాఖల కేంద్రమంత్రులను పవన్ కల్యాణ్ కలిశారు. టూరిజం మంత్రిని కలిసిన కాసేపటికే రూ.113కోట్లు విడుదల చేశారు. ఇక, జల జీవన్ నిధులను వారంలోగా విడుదల చేయాలని పీఎంఓ ఆదేశాలు జారీ చేసింది. అలాగే పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రం సమగ్ర నివేదిక కోరింది.
మహారాష్ట్ర ఫలితాల నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కు అభినందనల వెల్లువైంది. కాగా, నిన్న రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పవన్ విందు ఇచ్చాడు. వారితో పాటు పార్టీలకు అతీతంగా పలువురికి పిలుపునిచ్చారు. కాగా, ఏపీ అభివృద్ది చేసేందుకు పవన్ తపన పడుతున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసి చర్చించారు.
ఇదిలా ఉండగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటన వెళ్లారు. ఈ మేరకు ప్రధాని మోదీతో పవన్ భేటీ కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా పవన్ కల్యాణ్ పర్యటించిన నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేశాడు. వందశాతం ఫలితాలు రావడంతో పాటు అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దీంతో ఆయనకు ఢిల్లీలో రెడ్ కార్పెట్ పరిచారు.