Site icon Prime9

Deepthi Sunaina : ఏడుస్తూ వీడియో పోస్ట్ చేసిన “దీప్తి సునైనా”.. వైరల్ గా మారిన వీడియో

deepthi sunaina latest post on instagram goes viral

deepthi sunaina latest post on instagram goes viral

Deepthi Sunaina : సోషల్ మీడియా ఫేమ్ “దీప్తి సునైనా” గురించి తెలియని వారుండరు. వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ వీడియోలతో మోస్ట్ పాపులర్ అయింది ఈ క్యూట్ బ్యూటి. కాగా ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ కఇహి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది ఈ ముద్దుగుమ్మ. కాగా తనదైన శైలిలో ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఈ భామ.. నటుడు తనీష్ తో మొదట్లో క్లోజ్ గా ఉండి అ తర్వాత చివర్లో బ్రదర్ అనేసింది. అయితే ఒంటరిగా కంటే కూడా దీప్తి సునైన-షణ్ముఖ్ జస్వంత్ జంటగా బాగా పేరు తెచ్చుకున్నారు.

అయితే దీప్తి సునైన-షణ్ముఖ్ జస్వంత్ విడిపోయి చాలా కాలం అవుతుంది. 2021లో దీప్తి సోషల్ మీడియా వేదికగా తమ బ్రేకప్ మేటర్ రివీల్ చేశారు. కారణాలు వివరించకున్నప్పటికీ… షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పినట్లు అభిమానులతో పంచుకున్నారు. కాగా సిరి హన్మంత్ వలనే విడిపోయారన్న మాట గట్టిగా వినిపించింది. బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్, సిరి సన్నిహితంగా మెలిగారు. చెప్పాలంటే స్నేహితులమని చెప్పుకుంటూ ప్రేమికులకు మించి రొమాన్స్ చేశారు. ఇదంతా బయట నుండి గమనిస్తున్న దీప్తి మనసు గాయపడిందని, తాను అమితంగా ప్రేమించే వ్యక్తి మరొకరికి దగ్గరైనందుకు దీప్తి హర్ట్ అయ్యారని కథనాలు వెలువడ్డాయి. బిగ్ బాస్ షో ముగిసిన అనంతరం దీప్తి బ్రేకప్ ప్రకటన చేయడం అనుమానాలకు బలం చేకూర్చింది. అప్పటి నుండి దీప్తి-షణ్ముఖ్ విడివిడిగా ఉంటున్నారు. కెరీర్ పై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు. షణ్ముఖ్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. డిజిటల్ సిరీస్లు, మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నారు.

 

కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీప్తి సునైన తాజాగా పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆమె కన్నీరు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యారు.  మీరు నన్ను బహిష్కరించారు. నా జీవితం దుర్భరంగా తయారైంది అంటూ ఆ వీడియోలో వెల్లడించడం జరిగింది. తన ప్రియుడు షణ్ముఖ్ తో దీప్తి విడిపోయిన నేపథ్యంలో దీప్తి వీడియో ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా మరోవైపు షణ్ముఖ్ తన వీడియో లకి మాత్రం కొత్త పార్ట్నర్ ని వెతుక్కుంటున్నాడు. ఆయన లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘అయ్యయ్యో’లో షణ్ముఖ్ లవర్ గా ఫణి పూజిత నటిస్తున్నారు. ఇటీవల అయ్యయ్యో ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు. బ్రేకప్ కారణంగా ఇద్దరూ నష్టపోయారనే వాదన ఉంది. దీప్తి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. ఇక షణ్ముఖ్ సీజన్ 5 కంటెస్టెంట్ గా ఉన్నారు. షణ్ముఖ్ ఫైనల్ కి వెళ్లడంతో పాటు రన్నర్ గా నిలిచాడు. సన్నీతో పోటీపడ్డ షణ్ముఖ్ రన్నర్ పొజిషన్ తో సరిపెట్టుకున్నాడు.

Exit mobile version