Site icon Prime9

Daggubati Mohan Babu : దగ్గుబాటి కుటుంబంలో తీవ్ర విషాదం.. తుదిశ్వాస విడిచిన దగ్గుబాటి మోహన్ బాబు

daggubati rama naidu brother daggubati mohan babu passed away

daggubati rama naidu brother daggubati mohan babu passed away

Daggubati Mohan Babu : దగ్గుబాటి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దగ్గుబాటి రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు అకాల మృతి వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది.  ప్రస్తుతం ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రకాశం జిల్లా, కారంచేడులోని స్వగృహంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. దీంతో విషయం తెలియగానే నిర్మాత సురేష్ బాబు, ఆయన రెండో కుమారుడు అభిరామ్ కారంచేడు వెళ్లి మోహన్ బాబు పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. అయితే, వెంకటేష్ షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉండటంతో రాలేకపోయారు.

రామానాయుడు తర్వాత ఇంటి పెద్ద దిక్కుగా మోహన్ బాబు (Daggubati Mohan Babu)..

రామానాయుడు, మోహన్ బాబు మధ్య మంచి అనుబంధం ఉండేదని.. వారిద్దరూ ఒకే మాటపై ఉండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈరోజు ( బుధవారం ) మోహన్ బాబు అంత్యక్రియలు  నిర్వహించనున్నారు. ఇక రానా, వెంకటేష్‌, నాగచైతన్యలు కారంచేడుకు వెళ్ళి దగ్గుబాటి మోహన్ బాబు అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. దగ్గుబాటి కుటుంబ సభ్యులంతా సిటీల్లోనే స్థిరపడినప్పటికీ మోహన్ బాబు ఫ్యామిలీ మాత్రమే సొంతూరు కారంచేడులో ఉండి వ్యవసాయాన్ని చూసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇంటి పెద్ద దిక్కుగా ఉంటూ అందరి బాగోగులు చూసుకునే మోహన్ బాబు మరణంతో దగ్గుబాటి కుటుంబ సభ్యులు బాధ పడుతున్నారు.  ఇదిలా ఉంటే, ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక పాత్ర ఉంది. మూవీ మొఘల్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పలు భాషల్లో వందల చిత్రాలు నిర్మించిన గొప్ప నిర్మాత. ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ విక్టరీ వెంకటేష్ స్టార్ హీరోగా రాణిస్తుండగా.. సురేష్ బాబు ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇక పోతే నేటి తరం హీరోల్లో దగ్గుబాటి యంగ్ హీరో రానాకి నటుడిగా మంచి గుర్తింపు ఉంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా క్రేజ్ అందుకున్న ఈ హీరో.. కేవలం హీరోయిజం చిత్రాలే కాకుండా.. కంటెంట్ నచ్చితే చాలు ఎంతటి చిన్న సినిమా అయిన చేసేందుకు ముందున్నాడు. తెలుగులో చివరగా విరాట పర్వం చిత్రంలో సాయి పల్లవికి జోడిగా నటించారు రానా. ఇక ఇటీవల రానా నాయుడు వెబ్ సిరీస్ తో ఓటీటీలో సందడి చేశారు.

Exit mobile version