Site icon Prime9

CM Revanth Reddy: అవనిపై అగ్ర భాగాన నిలుపుతా.. ఏడాది పాలనపై సీఎం రేవంత్ ట్వీట్

CM Revanth Reddy Tweet On One Year Of Congress Ruling: తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సరిగ్గా పదేళ్లు పట్టింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ మేరకు సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏడాది ప్రజాపాలనలో చాలా సంతృప్తిగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు గొప్ప లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్నామన్నారు. విరామం లేకుండా ముందుకు సాగిపోతున్నామన్నారు. సమస్త ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చడమే లక్ష్యమన్నారు.

ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.‘పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను.. ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి డిసెంబర్ 7, 2023న తెలంగాణ నా చేతుల్లో పెట్టిందన్నారు. తన వారసత్వాన్ని సగర్వంగా సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే
బాధ్యతను అప్పగించిందన్నారు.

ఆక్షణం నుంచి జన సేవకుడిగా ప్రజా సంక్షేమ శ్రామికుడిగా మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో సకల జనహితమే పరమావధిగా జాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా సహచరుల సహకారంతో జనహితుల ప్రోత్సాహంతో విమర్శలను సహిస్తూ విద్వేషాలను ఎదురిస్తూ స్వేచ్ఛకు రెక్కలు తొడిగి ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచి అవనిపై అగ్ర భాగాన తెలంగాణను నిలిపేందుకు గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ 4 కోట్ల ఆశయాలను నడిపిస్తూ నిరంతరం జ్వలించే ఈ మట్టి చైతన్యమే స్ఫూర్తిగా విరామం ఎరుగక విశ్రాంతి కోరక ముందుకు సాగిపోతున్నాన్నారు.

Exit mobile version