Site icon Prime9

Experium Eco Park: ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్కును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Inaugurates Experium Experium ECO Park in Chevella: హైదరాబాద్‌లోని శివారులో చేవెళ్ల సమీపంలో ఉన్న ప్రొద్దుటూరులో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్కును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పార్కులో 150 ఎకరాల్లో రూ.450 కోట్లతో గార్డెన్ ఏర్పాటు చేశారు.

ఈ ఎకోపార్కులో 25వేల జాతుల మొక్కలు, చెట్లు ఉన్నాయన్నారు. అంతేకాకుండా 85 దేశాల నుంచి అరుదైన మొక్కలను దిగుమతి చేసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రామప్ప, వేయిస్థంభాల గుడి లాంటి ప్రపంచ ప్రఖ్యాత మందిరాలు ఉన్నాయన్నారు. మన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలకు తగిన గుర్తింపు తీసుకురాలేదన్నారు.

మన రాష్ట్రంలో టెంపుల్, ఎకో టూరిజం వెనకబడుతోందన్నారు. టెంపుల్, ఎకో టూరిజంతో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇప్పుడు వికారాబాద్‌లోనే మొక్కలు దొరుకుతున్నాయని, వికారాబాద్ ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉందని వివరించారు. వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. వికారాబాద్ అభివృద్ధికి దావోస్‌లో ఒప్పందాలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.

Exit mobile version