Site icon Prime9

AP CM Chandrababu Naidu: గంజాయి, డ్రగ్స్‌పై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu Interacts with Student and Parents at Mega Parents-Teachers Meet: విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్- టీచర్స్ మీట్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ మేరకు విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో డ్రగ్స్, గంజాయిపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. డ్రగ్స్, సెల్ ఫోన్ వంటి వ్యసనాలకు అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయన్నారు. పాఠశాలల నుంచే డ్రగ్స్ కట్టడికి ఉద్యమం మొదలు కావాలన్నారు. గంజాయి పండించినా.. సరఫరా చేసినా.. సేవించినా కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు అన్నారు. డ్రగ్స్ కట్టడికి ఈగల్ వ్యవస్థ తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఇక, సెల్ ఫోన్ కదా అని 24 గంటలు చూస్తూ ఉండిపోతే పనులు చేసే పరిస్థితి ఉండన్నారు.

టీచర్స్ అంటే గౌరవమని, అందుకే 11 సార్లు డీఎస్సీ నిర్వహించి డీఎస్పీ ద్వారా లక్షా 50వేల మందికి ఉపాధి కల్పించామన్నారు. ప్రతీ ఏడాది డీఎస్పీ నిర్వహించామని, భవిష్యత్తులోనూ డీఎస్సీ ద్వారా రిక్రూట్ మెంట్ చేసి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి వచ్చే ఏడాది ప్రారంభించిన మొదటి రోజున కొత్త టీచర్లు వచ్చేలా చేస్తానని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. మధ్యలో ఎవరైనా రిటైర్ అయినా ప్రైవేట్ ద్వారా టీచర్లను తీసుకొని అన్ని పాఠశాలలో టీచర్ అందుబాటులో ఉండేాలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి స్కూల్స్ ప్రారంభం నాటికి బాధ్యతలు తీసుకునేలా చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు సూచించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రతీ కిలోమీటర్‌కు ఒక ఎలిమెంటరీ స్కూల్.. ప్రతీ 3కిలో మీటర్లకు ప్రాథమిక పాఠశాలలు, ప్రతీ 5 కిలోమీటర్లకు ఉన్నత పాఠశాలలు పెట్టామన్నారు. ప్రతీ మండలంలో ఒక జూనియర్ కళాశాల పెట్టామనపి, రెవెన్యూ డివిజన్‌లో ఇంజనీరింగ్ కాలేజీ, జిల్లాలో మెడికల్ కాలేజీ ఉండేాలా విద్యకు ప్రాధాన్యత కల్పించామని వెల్లడించారు. కాలేజీలు, పదుల సంఖ్యలో మెడికల్ కాలేజీలు రావడంతో చాలామంది వైద్యులుగా ఎదిగారన్నారు.

గురుకులాలు, బాలికలకు ఇన్సూరెన్స్ వంటివి టీడీపీ తీసుకొచ్చిందన్నారు. 33శాతం రిజర్వేషన్లు, పాఠశాలల్లో అమ్మాయిలు టీచర్లుగా ఉండేలా చేశామన్నారు. గతంలో వారసత్వ సమస్యలు వచ్చాయన్నారు. గుంతల రోడ్డు, చెత్త పేరుకుపోయిందని, అప్పులు విపరీతంగా పెరిగాయన్నారు. గత పాలకులు బకాయిలు పెట్టారని విమర్శలు చేశారు. ఈ బకాయిలను చెల్లిస్తున్నామని వెల్లడించారు. టీచర్ల నియామకం చేయకపోవడంతో విద్యా వ్యవస్థ దెబ్బతిందని, జీఓ 117 తీసుకొచ్చి పాఠశాలలకు విద్యార్థులు దూరమయ్యేలా చేసిందన్నారు.

Exit mobile version