Site icon Prime9

CM Chandrababu: రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం.. 93శాతం మంది అభ్యర్థులను గెలిపించారు.. సీఎం చంద్రబాబు

CM Chandrababu Full Speech at Guntur: ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, అందుకే రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులో చేబ్రోలు హనుమయ్య కంపెనీ దగ్గర ఏర్పాటు చేసిన నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేసిందని చంద్రబాబు విమర్శలు చేశారు.

మమ్మల్ని నమ్మి 93 శాతం మంది అభ్యర్థులను గెలిపించారని చంద్రబాబు గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో అన్ని రంగాలు పతానావస్థలోకి చేరుకున్నాయన్నారు. అలాగే పడకేసిన నిర్మాణ రంగానికి మళ్లీ ఊతమిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర జీడీపీలో రియల్ ఎస్టేట్ వాటా 7.3 శాతం ఉందని, 2047 నాటికి 20 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు.

గత ప్రభుత్వం విధ్వంసం, బెదిరింపులకు పాల్పడిందని చంద్రబాబు అన్నారు. అన్ని రంగాల కంటే నిర్మాణ రంగం ఎక్కువగగా నష్టపోయిందని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకొచ్చారు. దీంతో పాటు రాష్ట్రంలో భూ సమస్యలు విపరీతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 100 పిటిషన్లు వస్తే అందులో 60 నుంచి 70 వరకు భూ సమస్యలేనని వివరించారు. అందుకే ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ తీసుకొచ్చామన్నారు.

రాష్ట్రంలో నిర్మాణ రంగం ఊపందుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. కొంతమంది అడ్డదారిలో వెళ్లడానికి ప్రయత్నిస్తారని, అడ్డదారుల్లో వెళ్లే వాళ్లతోనే సమస్యలు వస్తున్నాయన్నారు. అక్రమ కట్టడాలను అడ్డుకునే శక్తి ప్రభుత్వానికి ఉందని, డ్రోన్ల ద్వారా అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.

గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగం పడకేసిందని, నిర్మాణ రంగానికి చేయూతనిచ్చి పరుగులు పెట్టిస్తామని చెప్పారు. నిర్మాణ రంగానికి ఇసుక దొరక్కపోతే దబాయించి తీసుకోవచ్చన్నారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడామని, ఇఫ్పుడు ఏఐని అందరూ వినియోగించాలన్నారు.

Exit mobile version