Site icon Prime9

CM Chandrababu: రాజకీయాలకు కొత్త నిర్వచనం తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే

CM Chandrababu Visit Mydukur ysr dist: రాజకీయాలకు కొత్త నిర్వచనం తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ మేరకు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఇందులో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలుగు ప్రజల గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.

తెలుగు జాతి కోసం తపించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తు చేశారు. రాముడు, శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ రూపంలో చూస్తున్నామని చెప్పారు. ఆయన లాంటి వ్యక్తి మరొకరు రారన్నారు. ఒకవేళ ఆయన చేసిన పాత్రలు చేయాలంటే మళ్లీ ఎన్టీఆర్ జన్మించాలని, ఎవరికి సాధ్యం కాదన్నారు.

ఎన్టీఆర్ రాక ముందు దోపిడికి మారుపేరుగా ఉండే రాజకీయాలను ప్రజా హితం కోసం ప్రజా సేవ కోసం రాజకీయాలు చేసిన నాయకుడు అన్నారు. ఎన్టీఆర్ అంటే పేదవారి గుండెల్లో చెరగని ముద్ర అన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం ఎన్టీఆర్‌కు మాత్రమే సాధ్యమైందన్నారు. ఎన్టీఆర్ అంటే స్ఫూర్తి, ఆదర్శమని చెప్పుకొచ్చారు. రాజకీయం అంటే పెత్తందారీ విధానం కాదని, పేదల జీవితాలు మార్చేది రాజకీయమని చెప్పి చూపించిన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు.

ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు.. తెలుగు వారి గుండె ధైర్యమని వెల్లడించారు. తెలుగు ప్రజల గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. అలాగే ఆస్తి అడిగే హక్కు మహిళలకు ఇచ్చింది ఎన్టీఆరేనని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌కు పునాది వేసింది కూడా ఎన్టీఆర్ గుర్తు చేశారు. పేదరికం నిర్మూలించాలనేది ఎన్టీఆర్ కల అన్నారు.

పేదరికం లేని సమాజం టీడీపీతోనే సాధ్యమని, చూసి చూపిస్తామని స్పష్టం చేశారు. రాయలసీమకు కాంగ్రెస్ సహా మిగిలిప పార్టీలు చేసిందేమీ లేదని, టీడీపీ తప్ప మరే పార్టీ హయాంలోనూ కడపలో అభివృద్ధి జరగలేదన్నారు. రాయలసీమ రాళ్ల సీమ కాదు..రతనాల సీమ అని చెప్పింది ఎన్టీఆరేనన్నారు. అలాగే రాయలసీమకు నీళ్లు వచ్చాయంటే ఎన్టీఆరే కారణమని చెప్పారు. గాలేరు, నగరి, హంద్రీనీవాకు పునాది వేసింది కూడా ఆయనేనని, గండికోట కూడా ఎన్టీఆర్ మొదలు పెట్టిందేనని, రాయలసీమ ప్రాజెక్ట్‌లన్నీ ఎన్టీఆర్ మొదలుపెట్టినవేనని వివరించారు.

Exit mobile version