Site icon Prime9

Minister Rammohan Naidu: భవిష్యత్తు కోసమే.. సీఎం చంద్రబాబు నాయకత్వంపై కేంద్ర మంత్రి ప్రశంసల జల్లు

Civil Aviation Ministry To Ram Mohan Naidu: ప్రపంచంలో అధునాతన సాంకేతికత ఎక్కడ ఉన్నా.. ప్రజల కోసం, వాటిని సకాలంలో అందిపుచ్చుకున్న వారే నిజమైన నాయకులని కేంద్ర పార విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు అని టెక్నాలజీని సద్వినియోగంచుకోవడంలో ముందుంటారని కొనియాడారు. డ్రోన్‌ టెక్నాలజీ విస్తరణ, వినియోగం, ఆవిష్కరణలతో ఆంధ్రప్రదేశ్‌ను డ్రోన్‌ టెక్నాలజీకి రాజధానిగా మలచుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని నగరంలో 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ – 2024ను సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. నాయకులు, తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు తో కలిసి తొలిసారి వేదికను పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు యువకులను, టెక్నాలజీని ఎంతో ప్రోత్సహిస్తారని… దీనికి ఉదాహరణే కేబినెట్‌ మంత్రిగా పార్టీ తరపున తనను ఎంపిక చేయడం, ఈనాటి డ్రోన్‌ సమ్మిట్‌ అని పేర్కొన్నారు.

విజనరీ నాయకులు.. చంద్రబాబు
దేశంలోని ప్రతి రాష్ట్రం విమానాశ్రయాల అభివృద్ధి, మౌలిక వసతులు కల్పించాలని కోరుతుంటే.. చంద్రబాబు మాత్రం, కొత్త విమానాశ్రయాలు, సీ ఎయిర్‌ పోర్టులు, డోన్‌ టెక్నాలజీ వినియోగంపై మాట్లాడుతారని పార విమానయాన శాఖామంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. దార్శనికత, నాయకత్వానికి ఇదే నిదర్శనమన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాల తరహాలోనే ఉన్న రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ని విజన్‌ – 2020 తో ఐటీ రాజధానిగా చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ప్రతి నాయకుడు తరువాతి ఎన్నికల కోసం ఆలోచిస్తారని. చంద్రబాబునాయుడు మాత్రం తరువాతి తరం భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారని తెలిపారు.

విజయవాడ విపత్తే స్ఫూర్తి…
డ్రోన్‌ టెక్నాలజీని కేవలం 2, 3 రంగాలకే పరిమితం చేశారని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు గుర్తు చేశారు. అయితే… దీనికి ధీటుగా ఇటీవల విజయవాడను ముంచెత్తిన వరదల సమయంలో సిబ్బంది సైతం వెళ్ల లేని ప్రాంతాలకు సీఎం చంద్రబాబు సూచనలతో డ్రోన్లతోనే బాధితులకు మందులు, ఆహార పదార్థాలు, సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. సాంకేతికతను ఎంతగా సద్వినియోగించుకుంటే.. అంతగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని వైద్యం, వ్యవసాయం, రవాణా, రోడ్లు, ఇతర రంగాల్లో డ్రోన్‌ టెక్నాలజీని విస్తరించాల్సి ఉందన్నారు. దీనికి అనుగుణంగా మరిన్ని ఆవిష్కరణలు వచ్చేలా యువతను ప్రోత్సహిస్తామని వెళ్లడించారు. ఇకపై ఇతర దేశాల నుంచి దిగుమతులు కాకుండా… మరిన్ని కొత్త ప్రయోజనాలతో డ్రోన్లను ఇక్కడే తయారు చేసేలా ఈ రంగాన్ని విస్తరించేందుకే అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. బౌత్సాహిక వేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు.

Exit mobile version
Skip to toolbar