Site icon Prime9

Choreographer Chaitanya Suicide : అప్పుల బాధతో కొరియోగ్రాఫర్‌ చైతన్య ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోతో బయటపడ్డ కారణాలు

Choreographer Chaitanya Suicide and selfie video details

Choreographer Chaitanya Suicide and selfie video details

Choreographer Chaitanya Suicide : ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే ఢీ డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న చైతన్య మాస్టర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరులోని క్లబ్ హోటల్‌లో చైతన్య సూసైడ్ చేసుకున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, పెరిగిపోయిన అప్పుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చైతన్య సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఢీ డాన్స్ షో, జబర్దస్త్ ఎంతటి పాపులారిటీని సంపాదించుకున్నాయో అని అందరికీ తెలిసిందే. ఢీ లో కొరియోగ్రాఫర్ గా రాణిస్తూనే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో ల్లో అడపా దడపా కనిపించేవాడు చైతన్య.

సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. అమ్మా నాన్న.. చెల్లీ.. నన్ను క్షమించండి.. కొరియోగ్రాఫర్లూ.. మిమ్మల్ని హర్ట్‌ చేస్తున్నాను.. అప్పులు ఎక్కువయ్యాయి. చెల్లించలేక ఈ నిర్ణయం తీసుకున్నాను’.  అప్పులను తీర్చుకునేందుకు మరో అప్పు, దాన్ని తీర్చేందుకు ఇంకో అప్పు ఇలా చాలా ఎక్కువ అయిపోయాయన్నారు. తనకు పేరు తెచ్చిన డ్యాన్స్ షోకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఆ డ్యాన్స్ ప్రోగ్రాం ద్వారా పేరు వచ్చింది కానీ డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సంస్థ నిర్వహిస్తున్న మరో కామెడీ షోలో ఎక్కువ పారితోషికం లభిస్తుందని చెప్పారు.  సెల్ఫీ వీడియోని స్నేహితులకు పంపి.. గదిలోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చైతన్య స్నేహితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అయితే దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ సీతారామయ్య, ఎస్సై విజయకుమార్‌ నెల్లూరు క్లబ్‌కు చేరుకుని తలుపులు తెరిచేందుకు యత్నించగా.. అవి తెరుచుకోలేదు. దాంతో కిటికీలో నుంచి పోలీసులు లోనికి ప్రవేశించారు. అప్పటికే చైతన్య మృతి చెందారు. దీంతో పోలీసులు ఆయన తల్లిదండ్రులు, నెల్లూరు గ్రామీణ మండలం ధనలక్ష్మీపురంలో ఉన్న మేనమామ మాల్యాద్రికి సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని శవ పరీక్షల  నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతని మరణంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొనగా.. పలువురు ప్రముఖులు చైతన్య మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

కాగా చైతన్య.. లింగసముద్రం మండలం ముత్తావారిపాలేనికి చెందిన లక్ష్మీరాజ్యం సుబ్బారావు దంపతుల కుమారుడు. కొరియోగ్రాఫర్‌గా జీవనం సాగిస్తున్న అతను.. అమ్మా, నాన్న, చెల్లెలుతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా నగరంలోని కళాంజలి ఆర్కెస్ట్రా అండ్‌ ఈవెంట్స్‌ నిర్వాహకులు ఈ నెల 29వ తేదీ నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి చైతన్యను ఆహ్వానించారు. నెల్లూరుకు చేరుకున్న ఆయన.. బారాషహీద్‌ దర్గా సమీపంలోని నెల్లూరు క్లబ్‌లో గది అద్దెకు తీసుకున్నారు. శనివారం పుర మందిరంలో కళాంజలి ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం తనకున్న అప్పులు తీర్చలేక చనిపోతున్నానని ఈ దుర్ఘటనకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు, చెల్లెలు, స్నేహితులకు క్షమాపణలు చెబుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. దాన్ని స్నేహితులకు పంపి.. గదిలోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

 

Exit mobile version