Jani Master Case: జానీ మాస్టర్‌ లైంగిక వేధింపుల కేసు – కొరియోగ్రాఫర్‌ అనీ మాస్టర్‌ సంచలన కామెంట్స్‌!

  • Written By:
  • Updated On - October 22, 2024 / 10:22 PM IST

Anee Master Press Meet: ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ కేసు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది. రోజురోజుకు ఈ కేసులో కొత్త మలుపు తిరుగుతుంది. ఈ వ్యవహరం బయటకు వచ్చి నెల రోజులు దాటిన ఇంకా ఈ కేసులో పురోగతి కనిపించడం లేదు. గత నెల సెప్టెంబర్‌లో జానీ మాస్టర్‌ అసిస్టెంట్‌ మహిళా కొరియోగ్రాఫర్‌ ఆయనపై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనని కొంతకాలంగా జానీ మాస్టర్‌ శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేశాడంటూ బాధితురాలు రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ఈ వ్యవహరం వెలుగు చూసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు జానీ మాస్టర్‌పై పోక్సో చట్టం, లైంగిక ఆరోపణలు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జానీ మాస్టర్‌ అరెస్ట్‌ అయ్యి జైలుకు కూడా వెళ్లాడు.

ప్రస్తుతం ఆయన రిమాండ్‌లో ఉన్నాడు. అంతేకాదు లైంగిక ఆరోపణలు నేపథ్యంలో ఆయన గెలుచుకున్న నేషనల్‌ అవార్డును సైతం రద్దు చేశారు. అయితే జానీ మాస్టర్‌పై కేసుపై ఇంతవరకు డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ యూనియన్‌లోని కీలక సభ్యులెవరు స్పందించలేదు. సందీప్‌ మాస్టర్‌ ఆయన భార్య తదితుు నకు మద్దతు ఇస్తూ బాధితురాలి ఆరోపణలను ఖండించారు. కేసు బయటకు వచ్చిన ఇన్నాళ్లకు ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్‌ అనీ మాస్టర్‌ స్పందించారు. తాజాగా ఆమె మీడియాలో సమావేశంలో మాట్లాడుతూ జానీ మాస్టర్‌ కేసుపై సంచలన విషయాలు బయటపెట్టింది.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. జానీ మాస్టర్‌ నేషనల్‌ అవార్డు రద్దు చేయడం బాధాకర విషయమన్నారు. ఎంతో శ్రమించి ఆయన ఈ స్థాయికి వచ్చారని, జానీ మాస్టర్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం తనని షాక్‌కి గురి చేసిందంటూ ఆమె ఎమోషనల్‌ అయ్యారు. “జానీ మాస్టర్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం నన్ను షాక్‌ గురి చేసింది. బాధితురాలికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని నాకు తెలియదు. ఈ విషయం తెలిసి బాధపడ్డాను. కానీ నిజానిజాలు బయటకు వచ్చేవరకు నేను ఏది నమ్మను. కానీ నా సపోర్టు మాత్రం తనకు ఉంటుంది. ఒకప్పుడు మా మాస్టర్‌ గొప్ప అంటూ బాధితురాలు ఎన్నో సందర్భాలు చెప్పింది. మాస్టర్‌ని అంత గొప్పగా పొగిడిన ఆమె ఇలా కేసు పెట్టడం ఏంటనే సందేహం వచ్చింది. కానీ ఇందులో నిజం ఏంటనేది తేలవరకు నేను ఏం మాట్లాడలేను. ఇప్పుడు ఏదీ మాట్లాడిన అది తప్పుగా అర్థం చేసుకుంటారనే భయం ఉంది. కానీ నేను మాస్టర్‌ గురించి చెప్పేది ఇదే. ఆయన నాకు గురువుతో సమానం. జానీ మాస్టర్‌తో కలిసి నేను ఎన్నో సినిమాలకు పని చేశా. కానీ ఎప్పుడు నాతో తప్పుగా ప్రవర్తించలేదు. ఒకవేళ బాధితురాలికి నిజం అన్యాయం జరిగి ఉంటే మాత్రం తప్పుకుండ ఆమెకు నా మద్దతు ఉంటుంది” అని ఆమె చెప్పుకొచ్చారు.

అలాగే జాతీయ అవార్డు రద్దు చేయడంపై స్పందిస్తూ.. “జానీ మాస్టర్‌ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఆయన శ్రమకు తగిన గుర్తింపు ఇచ్చి దాన్ని మళ్లీ లాక్కోవడం బాధాకరం. ఇది సరైనది కాదని నా అభిప్రాయం. అయితే ఈ వ్యవహరం బయటకు వచ్చాక డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్‌లపై నెగిటివిటీ ఎక్కువైంది. ఇది చాలా సున్నితమైన అంశం. అందుకే దీనిపై ఎవరూ మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు. కానీ, నేను చూసినంత వరకు జానీ మాస్టర్‌ చాలా మంచి మనిషి. మా డ్యాన్సర్ల యూనియన్‌లో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతు ముందుగా స్పందించి వారికి ఆర్థిక సాయం చేసేది జానీ మాస్టర్‌, శేఖర్‌ మాస్టర్‌లు. అంతేకాదు బాధితురాలికి డైరెక్ట్‌గా యూనియన్‌లో సభ్యత్వం ఇప్పించడానికి జానీ మాస్టర్‌ ఎంతో సాయం చేశారు. కు కార్డు ఇప్పించందుకు మాస్టర్‌ దంపతులు ఎంతో ఫైట్‌ చేశారు. అలాంటి ఆమె జానీ మాస్టర్‌పై ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చే తీర్పు కోసం మేమంత ఎదురచూస్తున్నాం” అని అనీ మాస్టర్‌ పేర్కొన్నారు.