Prime9

Remo D Souza: ప్రముక డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌పై చీటింగ్‌ కేసు నమోదు

Cheating Case Filed on Star Choreographer: డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ లైంగిక ఆరోపణలు కేసు ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా ఉంది. ఈ కేసులో ఆయన అరెస్టు అయ్యి జైలుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన నేషనల్‌ అవార్డును సైతం రద్దు చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్‌ కేసు ఇండస్ట్రీలో సంచలనంగా ఉన్న తరుణంలో మరో కొరియోగ్రాఫర్‌పై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో మరోసారి సంచలనంగా మారింది. తాజాగా రెమో డిసౌజాతో పాటు ఆయన భార్య లిజెల్లేపై కూడా చీటింగ్‌ కేసు నమోదైంది.

బాలీవుడ్‌ చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రెమో డిసౌజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హిందీలో ఆయన ఎన్నో చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహిరించారు. ప్రస్తుతం ఆయన పలు డ్యాన్స్‌ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఓ యువ డ్యాన్సర్‌ రెమో ఆయన భార్యతో పాటు మరో ఐదుగురు తన దగ్గర డబ్బులు కాజేశారంటూ అతడు థానే పోలీసులను ఆశ్రయించారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు రెమో ఆయన భార్యతో పాటు మరో ఐదుగురిపై ఫోర్జరీ, చీటింగ్‌ కేసు నమోదు చేశారు.

కాగా గతంలో ఓ టెలివిజన్‌ డ్యాన్స్‌ ియాిటీ షో తన ీం పాల్గొని విజయం సాధించింది. అయితే ఆ టీం తమదేనని రెమోతో పాటు మిగతా వారు అబద్ధం ప్రచారం చేసుకుని 2018 – 2024 మధ్య సుమారు రూ. 11 కోట్లు పొందారని అతడు తన ఫిర్యాదు పేర్కొన్నారు. తన టీంను వారి టీంగా చెప్పుకోని కోట్లలో డబ్బు కాజేశారంటూ ఆరోపించాడు. దీంతో పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. కాగా రెమో డిసౌజా బాలీవుడ్‌లో స్టార్‌ హీరోల చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు. హృతిక్ రోషన్ క్రిష్‌ 3, బాజీరావ్‌ మస్తానీతో పాటు రోడ్‌, సాథియా. ధూమ్‌, క్యాష్‌, రేస్‌ 3 వంటి చిత్రాలకు పని చేశాడు. అంతేకాదు ప్రభుదేవ ఏబీసీడీ, ఏబీసీడీ 2 సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు.

Exit mobile version
Skip to toolbar