Site icon Prime9

Dragon Fruit: 50,000 హెక్టార్లలో డ్రాగన్ ఫ్రూట్ సాగు

New Delhi: ఆరోగ్య ప్రయోజనాల కోసం “సూపర్ ఫ్రూట్”గా పిలిచే డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రపంచ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, భారతదేశంలో దీని సాగును విస్తరించవచ్చని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో డ్రాగన్ ఫ్రూట్ 3,000 హెక్టార్లలో సాగు చేయబడుతోంది. ఐదేళ్లలో సాగును 50,000 హెక్టార్లకు పెంచాలని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది.

పోషక విలువల కారణంగా దేశీయ, ప్రపంచ మార్కెట్లలో ఈ పండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహుజా తెలిపారు. ఐదేళ్లలో యాభై వేల హెక్టార్లలో సాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. పండ్లకు డిమాండ్ అలాగే ఉంటుంది. రైతులకు ధరలు కూడా బాగానే ఉంటాయి. మరో విషయమేమిటంటే దీనిని వర్షాధార భూమిలోకూ సాగు చేయవచ్చని అహుజా చెప్పారు. రైతులకు నాణ్యమైన మొక్కలను అందించడంలో రాష్ట్రాలకు కేంద్రం సహకరిస్తుందని ఆయన తెలిపారు.

మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడిహెచ్) కింద రాష్ట్రాలు మరియు రైతులకు నిర్దిష్ట లక్ష్య ఆధారిత సహాయం కూడా కేంద్రం అందించగలదని ఆయన అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ సహాయంతో ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయవచ్చు. దీని సాగు రైతులకు, వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని అహుజా తెలిపారు.

Exit mobile version