Chicken: తెలుగు రాష్ట్రాల్లో కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అలాంటి వారి కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాడు ఓ చికెన్ షాప్ యజమాని. ప్రస్తుతం మార్కెట్ లో కిలో చికెన్ ధర రూ. 250 పై మాటే. కానీ ఇక్కడ మాత్రం రూ. 99 మాత్రమే కిలో చికెన్ ఇస్తున్నారు. ఈ వార్త విన్న మాంసం ప్రియులు.. చికెన్ సెంటర్ ఎదుట భారీ క్యూ కట్టారు. ఈ ఆఫర్ ఎక్కడో కాదు.. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో ఇది జరిగింది.
వ్యాపారులు తమ బిజినెస్ పెంచుకోడానికి వివిధ రకాల మార్గాలను అనుసరిస్తారు. లేదా కస్టమర్లను ఆకర్షించే ఆఫర్ లను ప్రకటిస్తారు. మరికొందరు.. వ్యాపార పోటీని తట్టుకోవడానికి మరి మార్జిన్లు తగ్గించుకుని మరీ అమ్మకాలు చేస్తుంటారు. తాజాగా ఓ చికెన్ కొట్టు యజమాని తన వ్యాపారం పెంచుకునేందుకు భారీ ఆఫర్ ప్రకటించాడు. ఈ ఆఫర్ కు అనూహ్య స్పందన కూడా లభించింది.
అసలే కొందరికి.. ముక్కలేనిదే ముద్ద దిగదు. పైగా చలికాలం కావడంతో చికెన్ ధర రూ. 250 రూపాయల వరకూ ఉంది.
ఇంత ధర పెట్టలేమని మాంసం ప్రియులు అంటున్నారు. అలాంటి వారికి ఓ యజమాని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. తక్కువ ధరకే చికెన్ ఇస్తామంటూ ప్రకటించారు.
కేవలం రూ. 99 కే కిలో చికెన్ ఇస్తామని ప్రకటించడంతో.. షాప్ ఎదుట మాంసం ప్రియులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు.
ఎక్కువ సంఖ్యలో జనం రావడంతో.. షాప్ యజమానికి చుక్కలు కనిపించాయి. దీంతో వారిని అదుపు చేసేందుకు నాటా తంటాలు పడాల్సి వచ్చింది.
మెుదటగా వచ్చినవారు తక్కువ ధరకే చికెన్ రావడంతో.. చాలినంత వరకు ఇంటికే తీసుకెళ్లారు.
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలకేంద్రంలోనీ భారత్ చికెన్ సెంటర్లో ఈ ఆఫర్ ను ప్రకటించారు.
కేవలం రూ. 99 రూపాయలకే కిలో చికెన్ అనడంతో.. మాంసం ప్రియులు బారులు తీరారు.
ముజ్జు అనే చికెన్ సెంటర్ వ్యాపారి రూ. 99 రూపాయలకే చికెన్ తీసుకెళ్లండి అంటూ ప్రకటించాడు.
ఈ సందర్భంగా చికెన్ సెంటర్ ఓనర్ మాట్లాడుతూ తనకు కోళ్ల ఫారం లు ఉన్నాయని.. అందుకోసమే ఇలాంటి ఆఫర్లు పెడతామని తెలిపారు.
మండల ప్రజలకు తక్కువ ధరకే చికెన్ అందించాలనేదే తమ ఉద్దేశం అని తెలిపారు.
అప్పుడప్పుడు ఇలాగా చికెన్ విక్రయాలు తక్కువ ధరకే చేపడుతామన్నారు.
మండల ప్రజలకు తక్కువ ధరలకే చికెన్ తినిపించాలనే ఉద్దేశంతో రెండు రోజుల పాటు ఇలా తక్కువ ధరకే విక్రయిస్తామని తెలిపారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/