Site icon Prime9

Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్‌‌కు గుడ్ న్యూస్.. వీరమల్లు ‘మాట వినాలి’ బీటీఎస్ వీడియో సాంగ్ రిలీజ్

BTS Video Song Of Hari Hara Veera Mallu 1st Single: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎ.దయాకర్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, లుక్స్ ఆకట్టుకున్నాయి. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ విపరీతంగా క్రేజీ సంపాదించుకుంది. తాజాగా, మేకర్స్ అప్డేట్ ప్రకటించారు. ఈ సినిమా బీటీఎస్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో పాట రికార్డింగ్, మేకింగ్ వంటి సీన్లను వీడియోలో చూడవచ్చు.

వినాలి.. వీరమల్లు మాట చెబితే వినాలి.. అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ మాట వినాలి.. గురుడా మాట వినాలి… మాట వినాలి మంచి మాట వినాలి.. అంటూ సాగుతోంది. ఇక, ఈ సినిమా నుంచి మరో 15 రోజుల్లో కొత్త ప్రమోషనల్ కంటెంట్ కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. పాట ప్రోమోలో పవన్ కల్యాణ్ స్టైల్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. అంతేకాకుండా త్వరలో మరో సాంగ్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా, సినిమా అప్డేట్స్‌ను మేకర్స్ వెంటవెంటనే విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇక, ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. తొలుత ఏప్రిల్ 2023 విడుదల చేయాలని అనుకున్నప్పటికీ.. పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా మార్చి 28న విడుదల అవుతుందని టాక్ వినిపిస్తోంది.

Maata Vinaali - BTS | Hari Hara Veera Mallu |PSPK | Nidhi | MM Keeravaani |AM Rathnam| Jyothi Krisna

Exit mobile version
Skip to toolbar