Site icon Prime9

Harish Rao Arrest: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అరెస్ట్‌

Harish Rao Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన నివాసం వద్దకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పాడి కౌశిక్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. అయితే బంజారాహిల్స్ పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు.

ఇందులో భాగంగానే గురువారం ఉదయం కొండాపూర్‌లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో విషయం తెలుసుకున్న హరీష్ రావు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు హరీష్ రావును అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే  హరీష్ రావుతో పాటు జగదీస్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హరీష్ రావును తరలిస్తున్న వాహనాన్ని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Exit mobile version