Jammu Kashmir Assembly: జమ్ముకాశ్మీర్‌లో రగడ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు

Big Fight In Jammu Kashmir Assembly:  భారతదేశానికే కాదు, ప్రపంచానికంతంటికి షాక్ ఇచ్చిన ఆర్టికల్ 370పై జమ్ముకాశ్మీర్ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి ప్రత్యేక హోదాను పునరుద్ధరించడానికి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఆర్టికల్ 370 పునరుద్దరించాలని ఎన్సీ ప్రభుత్వం తీర్మానం చేసింది. దీంతో బీజేపీ సభ్యులు ఆ తీర్మాన ప్రతులను చించి శాసన సభ వెల్ లోకి విసిరారు. ఈ మధ్యలో అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే షేక్ ఖుర్షీద్ ఆర్టికల్ 370పై బ్యానర్ ప్రదర్శించాడు. ఇదింకా రచ్చగా మారింది. దీంతో ఇరు పార్టీల ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకుంటూ సభలో గందరగోళం చేశారు.

సర్వత్రా ఆందోళన
అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పరస్పరం దాడులు చేసుకుంటున్న సమయంలో షేక్ ఖుర్షీద్ వెల్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకున్నారు. మొత్తానికి రచ్చరచ్చగా మారిన ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రైనా స్పందించారు. ఎన్సీ, కాంగ్రెస్‌లు భారత వ్యతిరేక భావాలను పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ కా హాత్‌ పాకిస్థాన్‌ కే సాత్‌, కాంగ్రెస్‌ కే హాత్‌ టెర్రరిస్టుల కే సాత్‌ అని విమర్శించారు. అయితే ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.