Site icon Prime9

Balakrishna: బావ ఇంట బావమరిది సందడి.. నారావారిపల్లె సంక్రాంతి వేడుకల్లో బాలకృష్ణ హంగామా

balakrishna in naravari palle

balakrishna in naravari palle

Balakrishna: చిత్తూరు జిల్లా నారావారి పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మూడేళ్ల అనంతరం నారావారి ఇంట‌ సంక్రాంతి వాతావరణం నెలకొంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్‌లతో సహా నారా కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది.

బాలకృష్ణకు అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మనవడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇప్పటికే వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈరోజు నిర్వహించే భోగి సంబరాల్లో బాలకృష్ణ, నారా లోకేష్ పాల్గొంటారు. ఆ తర్వాత పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ కలిసి పాల్గొంటారు.

ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. తమను ఎంతో ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రజలందరూ సంతోషంగా సంక్రాంతి పండగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

అటు వీరసింహారెడ్డి సూపర్‌ సక్సెస్‌తో బాలయ్య ఊపు మీద కనిపిస్తున్నారు.

ఇటు బావా బావమరుదులు, అటు మనవడు దేవాన్ష్ రాకతో నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.

ఈ నేపథ్యంలో నందమూరి, నారా కుటుంబీకులు భోగి మంటలతో వేడుకలను ఆరంభించారు.

అటు వీరసింహారెడ్డి సూపర్‌ సక్సెస్‌తో బాలయ్య ఊపు మీద కనిపిస్తున్నారు.

జాగా భోగీ పండగ రోజు ఉదయాన్నే హీరో బాలయ్య నారావారిపల్లెలో జాగింగ్ చేస్తూ అందర్నీ ప్రేమగా పలకరించారు.

తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

స్వగ్రామం నారావారిపల్లె లో చంద్రబాబు టీడీపీ కార్యకర్తలతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మీడియాపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.

మీడియా అధికార పార్టీకి ఉంపుడు గత్తెల్లా మారిపోయిందని, వైసీపీ నాయకులు ఏమి రాయమంటే అది రాస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ నాయకులు రౌడీయిజం, గూండాయిజం, హత్యలు, కుట్రలు, కుతంత్రాలకు తెర లేపారని విమర్శించారు.

అది చాలా తప్పని, ఆ తప్పును కూడా పోలీసులు ద్వారా కప్పి పుచ్చుకోవాలని చూస్తున్నారన్నారు.

పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

సంక్రాంతి తర్వాత తన పోరాటంలో మరింతగా స్పీడ్ పెంచుతానని, మరింత కఠినంగా మారతానని తెలిపారు.

ఈ సంక్రాంతి భవిష్యత్తు మీద భరోసా కోసం పోరాడే శక్తినిస్తుందన్నారు.

ప్రజాస్వామ్యంలో సేవా భావంతో పని చేసే వ్యవస్థ రాజకీయం అని తెలిపారు చంద్రబాబు.

క్రాంతి అంటే అభ్యుదయం అని, సంపదలు, సంస్కృతి పరంగా పురోగతిని ఆశిస్తూ వచ్చే పండుగ సంక్రాంతి అని తెలిపారు.

భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజుల పండుగ సంక్రాంతి అని చంద్రబాబు స్పష్టం చేశారు.

పల్లెల్లో సందళ్లు, సరదాలు, జ్ఞాపకాలు పంచే అతిపెద్ద పండుగ సంక్రాంతి అన్నారు.

తెలుగు ప్రజలు పల్లె సీమలకు తరలే వెళ్లే ఆత్మీయ పండుగని గుర్తుచేసుకున్నారు.

టీడీపీ ప్రభుత్వంలో పేదలకు పండుగ కానుకలు ఇచ్చే సంప్రదాయానికి నాంది పలికామన్నారు.

ధనిక, పేద తారతమ్యాలు మర్చిపోయి అన్ని వర్గాల ప్రజలు సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవాలన్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar