Site icon Prime9

Bairi Indira: గజల్ దిగ్గజం బైరి ఇందిర కన్నుమూత.. కవితనే ‘వీలునామాగా’ రాసుకున్న అక్షరజీవి

bairi indira

bairi indira

Bairi Indira: ప్రముఖ గజల్‌ రచయిత్రి ఇందిరా బైరి కన్నుమూశారు. తెలంగాణ తొలి మహిళా గజల్ దిగ్గజంగా ఆమె పేరుగాంచారు. భద్రాద్రి జిల్లా ఇల్లెందుకు చెందిన బైరి ఇందిర కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ నిజాంపేట్ లో ఆమె తుదిశ్వాస విడిచారు.

600పైగా గజల్స్​ రాసిన ఇందిర (Bairi Indira)

బైరి ఇందిర సుమారు 600కు పైగా గజల్స్ రాశారు. ముఖ్యంగా.. అభ్యుదయ భావాలు, సాంఘిక దురాచారాలు, కుల వివక్ష, మహిళలపై వేధింపులపై గజల్స్ ద్వారా అవగాహన కల్పించేవారు. తెలంగాణ గజల్ కావ్యం, గజల్ భారతం, సవ్వడి, మన కవులు వంటి గజల్స్ ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. రావి రంగారావు సాహిత్య కళా పీఠం నుంచి ‘జనరంజక కవి పురస్కారం’ తో పాటు పలు అవార్డులను అందుకున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్ లోని తన కూతురి నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె స్వస్థలం భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు పట్టణం. అక్కడ 20 ఏళ్ల పాటు ప్రభుత్వ పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. ఆమె భర్త రామశంకరయ్య. ప్రముఖ గజల్స్‌ గాయని హిమజా రామమ్‌ ఆమె కూతురే. ఇందిరా ఇప్పటివరకు దాదాపు 600కు పైగా గజల్స్‌ రాశారు. బతుకమ్మ, ఉద్యమ నేపథ్యం, తెలంగాణ అమరవీరులు, సాయుధ పోరాటం, మన పండుగలపై అనేక గజల్స్‌ రాశారు. వీటితోపాటు ఇతర రచనలు, కథల సంపుటాలు అనేకం రాశారు. రావిరంగారావు సాహిత్య కళాపీఠం నుంచి ఇందిర ‘జనరంజక కవి పురసారం’ అందుకున్నారు.

తెలంగాణ గజల్ సాహిత్యానికి విశేష కృషి

తెలంగాణ గజల్ సాహిత్యానికి విశేష కృషి చేశారు బైరి ఇందిర. మహిళా గజల్స్ రచయితల్లో తొలిసారిగా గజల్స్ సంకాలను విడుదల చేసి ఆమె చరిత్ర సృష్టించారు. వృత్తిరిత్యా ప్రధానోపాధ్యాయురాలు అయిన ఆమె.. ఓవైపు విధులు నిర్వర్తిస్తూనే తీరిక సమయాల్లో గజల్స్ రాశారు. ఇందిర మరణ వార్త విని సాహిత్యవేత్తలు, గజల్ అభిమానాలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గజల్స్ కు ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చారు. అభ్యుదయ భావాలు, సాంఘిక దురాచారాలపై ఆమె రాసిన గజల్స్ అందరిన ఆలోచింపజేశాయి. కుల వివక్ష, మహిళల వేధింపులపై ఆమె రాసిన గజల్స్ ఎందరికో స్ఫూర్తినిచ్చాయి.

కవితనే వీలునామాగా రాసుకున్న అక్షరజీవి

కడవరకు ఆత్మస్థైర్యంతో జీవించారు. కవిత్వాన్నే తల వీలునామాగా రాసుకున్నారు. ‘నేను పోయినప్పుడు ఓ కాగితాన్ని కప్పండి.. రాసుకోడానికి పనికొస్తుంది. మట్టిలో కప్పెట్టకండి మరీ గాలాడదు.. పురుగూ పుట్రా ఉంటాయ్. పెన్సిలు, రబ్బరు, కర్చీఫ్ బ్యాగులో ఉండేలా చూడండి.. సెల్ మర్చిపొయ్యేరు బోర్ కొట్టి చస్తాను. దండలు గిండలు వెయ్యకండి.. నాకు ఎలర్జీ. పసుపు గట్రా పూసి.. భయంకరంగా మార్చకండి. పిల్లలు ఝడుసుకుంటారు.. పైగా నన్ను గుర్తుపట్టాలి కదా. పుణ్యస్త్రీ, పాపపు స్త్రీ అని పేర్లు పెట్టకండి.. నాకు చిర్రెత్తుకొస్తుంది. నా సామాన్లన్నీ పడేయకండి.. అడిగినవాళ్లకు ఇచ్చేయండి. కాస్త చూసి తగలబెట్టండి.. పక్కన మొక్కలుంటాయేమో. పనిలో పని కాష్టం దగ్గర కవిసమ్మేళనం పెట్టండి.. నేనూ ఉ(వి)న్నట్టుంటుంది. అనే కవితను వీలునామాగా రాసుకున్నారు.

 

Exit mobile version