ARI Movie Promotions Starts Again But Why Release Delayed: సినిమా పరిశ్రమ విచిత్రమైంది. ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఒక్కోసారి కొన్ని సినిమాలు అనుకోకుండానే షూటింగ్ నుంచి మొదలు పెడితే థియేటర్లలోకి వచ్చే వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే మరికొన్ని చిత్రాలకు ఆరంభం నుంచి రిలీజ్ అయ్యే వరకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఇందులో కొన్ని చిత్రాలు ఏళ్లతరబడి కొనసాగుతుంటాయి. అందులో కొన్ని ల్యాబ్‌కే పరిమితమవుతుంటాయి. కొన్ని సినిమాలు కరైన కంటెంట్ లేకపోవడంతో నిలిచిపోయేవి ఎక్కువగా ఉంటాయి. మరికొన్ని సినిమాలు మాత్రం ఇప్పటికీ ఎవరూ రాయని కంటెంట్‌తో పాటు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న కాన్సెప్ట్‌తో వచ్చేవి ఉంటాయి. ఈ పాయింట్ కింద తీసిన సినిమానే ‘అరి’.
పేపర్ బాయ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన జయశంకర్ తెరకెక్కించిన ‘అరి’ మూవీ పూర్తయి రెండేళ్లు గడిచింది. అయితే ఈ సినిమా కంటే ముందు జయశంకర్ గీతా ఆర్ట్స్ మరో సినిమా చేయాలి. కానీ లాక్ డౌన్ పడడంతో ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైన ముందుకు వెళ్లలేదు. దీంతో ‘అరి’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను ప్రధానంగా అరిషడ్వర్గాలపై కథనం రాసుకోగా.. వినోద్ వర్మ, సేర్య పురిమెట్లచ అనసూయ, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలో నటించారు.
షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఏడాది క్రితమే విడుదలకు సిద్ధమైంది. అయితే అనుకోకుండా సినిమా విడుదల నిలిచిపోయింది. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ ఓ లెవల్‌లో చేరాయి. అరి టీజర్ తో పాటు ట్రైలర్ ఆకట్టుకుంది. మంగ్లీ పాడిన ఓ సాంగ్ రీలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సమయంలో బీజేపీ మంత్రులు సినిమాకు అభినందనలు తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి, చిన్న జీయర్ స్వామి తదితరులు ప్రశంసల వర్షం కురిపించారు. కానీ సినిమా రిలీజ్ కాలేదు.
తాజాగా, ‘అరి’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో థీమ్ సాంగ్ రిలీజ్ చేయించారు. ఇందులో భాగంగానే భగభగ.. అనే సాంగ్ ఆకట్టుకుంది. అయితే మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించకపోవడంతో అందరిలోనూ ఇంతకు సినిమా రిలీజ్ అవుతుందా? లేదా ? అనే ప్రశ్న మొదలైంది. పెద్ద పెద్ద బీజేపీ నాయకులు ఈ సినిమాకు అండగా నిలిచిన ఎందుకు థియేటర్లలోకి రావడం లేదో తెలియకుండా పోయింది. ఇలాంటి కొత్త కథలకు సంబంధించిన సినిమాలు త్వరగానే విడుదల కావాలి. లేదంటే స్టోరీ రోటీన్‌గా మారే అవకాశం ఉందని సినిమా పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది.