Site icon Prime9

AP Government: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

AP Government Transferred 27 IPS Officers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ జాబితా..
సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం.. ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్ మీనాను నియమించారు. శాంతిభద్రతల అదనపు డీజీగా ఎన్‌ మధుసూదన్‌రెడ్డిని బదిలీ చేసింది. ఐజీపీ ఆపరేషన్స్‌గా సీహెచ్‌ శ్రీకాంత్‌ నియమించింది.. ఆయనకు టెక్నికల్‌ సర్వీసెస్‌ అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ డైరెక్టర్‌గా జీ పాలరాజు, ఏపీఎస్పీ బెటాలిన్ల ఐజీపీగా జీ రాజకుమారిని నియమించింది. ఏసీబీ డైరెక్టర్‌ రాజ్యలక్ష్మి, స్పోర్ట్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ డీఐజీగా అంబురాజన్‌, గ్రేహౌండ్స్‌ డీఐజీగా బాబ్జీ, ఏపీఎస్పీ డీఐజీగా పకీరప్ప, కర్నూల్‌ ఎస్పీగా విక్రాంత్‌ పాటిల్‌ బదిలీ అయ్యారు.

తిరుపతి ఘటన ఎఫెక్ట్
ఇటీవల తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ముందు తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు పడింది. ఈ క్రమంలో తిరుపతి ఎస్పీగా హర్షవర్థన్‌రాజును ప్రభుత్వం నియమించింది. అలాగే, ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగా సుబ్బారాయుడు, ఏపీఎస్పీ కర్నూల్‌ కమాండెంట్‌గా దీపిక, లీగల్‌, హ్యూమన్‌రైట్స్‌ కోఆర్డినేషన్‌ ఎస్పీగా సుబ్బారెడ్డిని బదిలీ చేసింది. సీఐడీ ఎస్పీలుగా పరమేశ్వర్‌రెడ్డి, శ్రీధర్‌, విశాఖపట్నం డీసీపీగా కృష్ణకాంత్‌ పాటిల్‌, అల్లూరి సీతారామరాజు అదనపు ఎస్పీగా ధీరజ్‌, అల్లూరి సీతారామరాజు ఆపరేషన్‌ అదనపు ఎస్పీగా జగదీష్‌, ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా రామ్మోహన్‌రావు, సీఐడీ ఎస్పీగా శ్రీదేవిరావు, చక్రవర్తి, కడప ఎస్పీగా అశోక్‌కుమార్‌, ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా రమాదేవి, విజయవాడ డీసీపీ అడ్మిన్‌గా సరిత, కాకినాడ ఎస్పీగా బింధుమాధవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version
Skip to toolbar