Ap Employees: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం సకాలంలో జీతాలు , బకాయిలు చెల్లించడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ కలిసి ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల ఇబ్బందులను ఎన్ని సార్లు ప్రభుత్వం దగ్గరకు తీసుకెళ్లినా స్పందించడం లేదని ఈ సందర్భంగా గవర్నర్ దృష్టి కి తీసుకెళ్లారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని, కోట్లాది రూపాయల బకాయిలు, పెన్షన్ల చెల్లింపుకు గవర్నర్ జోక్యం చేసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు.
ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, కార్యదర్శి భాస్కరరావు, జనరల్ సెక్రటరీ తో పాటు మరో 6 మంది ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.
జనవరి 15 తర్వాత ప్రభుత్వం ఏ విషయం తేల్చకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సూర్యనారయణ ఆరోపించారు.
ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎస్ ను విత్ డ్రా చేశారు. 90 వేల మంది ఉద్యోగుల అకౌంట్ నుంచి చెప్పాపెట్టకుండా డబ్బులు తీసుకున్నారన్నారు.
ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగ వ్యవస్థపై ప్రత్యక్ష సంబంధాలు, అధికారాలు గవర్నర్ కు ఉంటాయని ఉద్యోగ నేతల చెప్పారు. అందుకే గవర్నర్ కలిసి సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు.
నెలలో 15 తేదీ వరకు జీతాలు పడుతూనే ఉంటాయని.. పెన్షన్ల పరిస్థితి అలాగే ఉందని తెలిపారు.
ఏపీ లో ఉద్యోగులకు జీతాలు సకాలంలో రావడంలేదని ఉద్యోగ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ప్రభుత్వం అవమానిస్తోంది..
ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం అవమానకరరీతిలో వ్యవహరిస్తోందని సూర్యనారాయణ తెలిపారు.
ఉద్యోగులు డీఏ బకాయిలు, జీపీఎఫ్ బకాయిలు, సీపీఎస్ వాటా నిధులు 10 వేల కోట్ల పైన ప్రభుత్వం బకాయి ఉందన్నారు.
తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. ఏప్రిల్ నుంచి రాష్ట్ర కౌన్సిల్ నిర్ణయం ప్రకారం ఆందోళన చేపడతామన్నారు.
ఆర్థిక శాఖ అధికారులు, మంత్రి వర్గ ఉపసంఘానికి సమస్యలు చెప్పామని.. వారు స్పందించకపోవడం వల్లే గత్యంతరం లేని పరిస్థితుల్లో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు.
గవర్నర్ కు జీవోలతో సహా అన్ని వివరాలు వివరించామని తెలిపారు. ప్రభుత్వం నుంచి మొదటి చెల్లింపుదారుడిగా క్లెయిమ్స్ సెటిల్ చేసేలా చట్టాన్ని తీసుకురావాలని గవర్నర్ ను కోరినట్టు ఆయన అన్నారు.
తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతాం..
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ నుంచి బకాయిలు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.
కానీ మళ్లీ ఏప్రిల్ నుంచి బకాయిలు ఇస్తామని మరో మూడు నెలలు పొడిగించిది.
ఈ క్రమంలో ఏప్రిల్ నుంచి బకాయిలు చెల్లించకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
అయితే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయని, ఉద్యోగులు తమకు మద్దతుగా ఉండాలని కోరుతున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/