Site icon Prime9

Amazon Prime Day Sale 2022: అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐ ఫోన్ 13, ఇతర మోడల్స్ రూ. 20,000 వరకు తగ్గింపు

Amazon Prime Day Sale 2022: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ జూలై 23 నుండి ప్రైమ్ డే సేల్‌ను నిర్వహించనుంది, ఇది జూలై 24 వరకు కొనసాగుతుంది. సేల్‌కు ముందు, ఐఫోన్‌లపై భారీ తగ్గింపులు ఉంటాయని అమెజాన్ వెల్లడించింది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో మరియు ఐఫోన్ 13 ప్రో మాక్స్‌తో సహా ఐఫోన్ మోడల్స్ పై రూ. 20,000 వరకు తగ్గింపును అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ డీల్స్‌కు సంబంధించిన నిర్దిష్ట వివరాలను అమెజాన్ ఇంకా వెల్లడించలేదు.

ప్రైమ్ డే సేల్ కోసం, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ 10 శాతం తక్షణ తగ్గింపును అందించడానికి ఐసిఐసిఐ బ్యాంక్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లు, ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌లు మరియు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లు మరియు ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌లపై ఇఎంఐ లావాదేవీలతో షాపింగ్ చేయడంపై వినియోగదారులకు 10 శాతం తగ్గింపు లభిస్తుందని అమెజాన్ వెల్లడించింది. ప్రస్తుతం ఐఫోన్ 13 బేస్ 128GB స్టోరేజ్ మోడల్ కోసం భారతదేశంలో రూ. 79,900 నుండి ప్రారంభమవుతుంది. 256GB మరియు 512GB సహా ఇతర రెండు మోడల్స్ వరుసగా రూ.89,900 మరియు రూ.1,09,900లకు అందుబాటులో ఉన్నాయి.

అదనంగా అమెజాన్ వన్ ప్లస్ ఫోన్‌లు, జియోమి ఫోన్‌లు, శాంసంగ్ ఫోన్‌లు, iQOO ఫోన్‌లు మరియు రియామి ఫోన్‌లపై డిస్కౌంట్లను అందజేస్తుంది. వన్ ప్లస్ 9 సిరీస్ రూ. 15,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అదనంగా వన్ ప్లస్ 10 సిరీస్ మోడళ్లపై కూడా తగ్గింపు ఆఫర్లు ఉంటాయి. రెడ్ మి 9 సిరీస్, రెడ్ మి నోట్ 10 సిరీస్ మరియు మరిన్ని సహా అనేక రెడ్ మి ఫోన్‌లు భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంటాయి.కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు, ప్రింటర్లు, సౌండ్‌బార్‌లు మరియు మరిన్నింటితో సహా అనేక ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై తగ్గింపులను ఆఫర్ చేస్తున్నట్లు అమెజాన్ ధృవీకరించింది.

Exit mobile version