Site icon Prime9

Amazon: అమెజాన్‌ కీలక నిర్ణయం.. ఇక 3 రోజులు వర్క్ ఫ్రం ఆఫీస్

amazon

amazon

Amazon: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని కోరింది.

తాజాగా కంపెనీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు అమెజాన్‌ సీఈవో ఆండీ జెస్సీ తన నిర్ణయాన్ని ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా వర్క్‌ ఫ్రం హోం కు అనుమతించిన అమెజాన్‌ సంస్థ..

ఈ ఏడాది మే నెల నుంచి వారానికి కనీసం మూడు రోజు వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ అంటూ ప్రకటించింది.

వారానికి మూడు రోజులు(Amazon)

కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌ను మధ్యలో సడలించినప్పటికీ.. అమెజాన్ ఉద్యోగులు ఇంకా ఇంటి నుంచే పనిచేస్తున్నారు.

తమ ఉద్యోగులు ప్రధాన నగరాల్లోని కార్యాలయాలకు వస్తే మా వ్యాపారానికి ప్రోత్సాహం లభిస్తుందని అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండీ జెస్సీ అమెజాన్ బ్లాగ్‌లో పోస్ట్ చేసిన సందేశంలో పేర్కొన్నారు.

అయితే వర్క్ ఫ్రం ఆఫీసు నియమానికి మినహాయింపులు ఇస్తూ.. కస్టమర్ సపోర్ట్ రోల్స్, సేల్స్‌పీపుల్ రిమోట్‌గా పని చేసే అవకాశం కల్పించారు.

18 వేల మందికి ఉద్వాసన

ఈ ఏడాది జనవరిలో అమెజాన్ యునైటెడ్ స్టేట్స్, కెనడా, కోస్టా రికాలో ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. గతేడాది నవంబర్ నెలలో పదివేల మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్..

జనవరిలో మరో 18వేల మందిని ఇంటికి పంపేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. అమెజాన్ గురువారం జనవరి 2023లో తొలగింపులను కొనసాగిస్తున్నట్లు ధృవీకరించింది.

గత కొన్ని నెలలుగా తొలగింపులు, ఉద్యోగాల కోతలను ప్రకటించిన పలు టెక్ కంపెనీలలో అమెజాన్ ఒకటి.

Exit mobile version
Skip to toolbar