Jammu Kashmir: పాక్షికంగా నిలిపివేసిన అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. కుంభవృష్టి కారణంగా దక్షిణ కశ్మీర్ లోని అమర్‌నాథ్ గుహ సమీపంలో వరదలు సంభవించడంతో నిలిచిపోయిన యాత్ర. మూడు రోజుల తర్వాత యాత్ర ఆరంభమైంది.‘‘మేం బాబా దర్శనం లేకుండా తిరిగి వెళ్లలేమని, మాకు భోలే బాబాపై పూర్తి విశ్వాసం ఉందని, యాత్ర తిరిగి ప్రారంభమైనందుకు సంతోషిస్తున్నామని అమరనాథ్ యాత్రికులు అంటున్నారు. సీఆర్‌పీఎఫ్ ఇతర సిబ్బంది మార్గనిర్దేశం చేస్తుండటంతో యాత్రికులు ముందుకు సాగుతున్నారు.
బాల్తాల్ బేస్ క్యాంపు వద్ద యాత్రికులు యాత్రను పునర్ ప్రారంభించారు. శుక్రవారం అమర్‌నాథ్ గుహ పుణ్యక్షేత్రం సమీపంలో వరదలు సంభవించిన కారణంగా 16 మంది మరణించారు. మరో 36 మంది మంది గల్లంతయ్యారు. హెలికాప్టర్ల ద్వారా గాయపడిన మరో 34 మంది యాత్రికులను ఆసుపత్రికి తరలించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పహల్గామ్‌లోని బేస్ క్యాంపును సందర్శించి యాత్రికులను కలిశారు. వరదలతో దెబ్బతిన్న రోడ్డు మార్గానికి మరమ్మతులు చేయిస్తున్నారు. జమ్మూ వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం నిర్వహించడానికి తాము రెస్క్యూ పరికరాలను వినియోగిస్తున్నామని సైన్యం తెలిపింది.