Site icon Prime9

Tirupati: తిరుపతిలో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం

25 lakhs EX Gratia to the Died Families In Tirupati Incident: తిరుపతిలో వైకుంఠ దర్శనం టోకెన్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించింది. రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

అలాగే తొక్కిసలాట ఘటనపై కేసులు నమోదు చేశారు. ఈస్ట్ పీఎస్‌లో నారాయణవనం తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. బీఎన్ఎస్ 194 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబుతో సీఎంఓ అధికారులు సమావేశం నిర్వహించారు. తొక్కిసలాట ఘటనపై అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు తెలుసుకున్నారు.

తొక్కిసలాటకు కారణాలేంటటో దర్యాప్తులో తేలుతుందని మంత్రి సత్యకుమార్ అన్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. వెంటిలేటర్‌పై ఎవరూ లేరని, ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న క్షతగాత్రులందరూ ఆరోగ్యంగానే ఉన్నారని మంత్రి వివరించారు.

Exit mobile version