Site icon Prime9

IPL 2025: ఐపీఎల్ వేలంలో 1574 క్రికెటర్లు.. ఈనెల 24, 25న సౌదీ అరెబియాలో మెగా వేలం పాట

1574 Players Registered For Auction IPL 2025: ఎట్టకేలకు ఐపీఎల్ మెగా వేలం పాటలో పాల్గొనే క్రికెటర్ల పేర్లు నమోదు ప్రక్రియ ముగిసింది. సౌదీ అరెబియాలోని జెడ్డాలో నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో 1574 మంది క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 1165 మంది భారతీయులున్నారు. 409 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనేందుకు ఇంత భారీ కాంపిటేషన్ ఎక్కడా లేదని ఇదొక రికార్డ్ అని కూడా అంటున్నారు. ప్రపంచంలోని క్రికెట్ ఆడే దేశాల్లో అత్యంత ఖరీదైన లీగ్ గా ఐపీఎల్ కి పేరుంది. అందుకే ఆటగాళ్లందరూ ఇక్కడ ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే మొదటి నుంచి ఎంతో సంచలనం సృష్టించిన ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వివాదం సర్దుకుంది. ఆ ఫ్రాంచైజీ యజమాన్యం తనని కూడా అట్టే పెట్టుకుంది. బహుశా భారీగా ముట్టజెప్పి ఉంటారని అనుకుంటున్నారు.

ముగ్గురికి భారీ ధర..
ఈసారి మెగా వేలంలో చాలామంది భారత స్టార్ ఆటగాళ్లున్నారు. గత సీజన్ లో కెప్టెన్లుగా ఉన్న రిషబ్ పంత్ (ఢిల్లీ), శ్రేయాస్ అయ్యర్ ( కోల్ కతా) కేఎల్ రాహుల్ (లఖ్ నవ్)లను ఫ్రాంచైజీలు పక్కన పెట్టాయి. అయితే ట్రోఫీ తెచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ను కోల్ కతా వదిలేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ముగ్గురికి భారీ ధర పలికేలా ఉంది. కాకపోతే వీరు తమ కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఇక యుజేంద్ర చాహల్, అశ్విన్, మహ్మద్ షమి, దీపక్ చాహర్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, ముఖేష్ కుమార్, భువనేశ్వర్, ప్రసిద్ధ్ కృష్ణ, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్ తదితర ఇండియన్ క్రికెట్ జట్టుకు ఆడే ప్రతి ఒక్కరు కూడా తమ కనీస ధర రూ.2 కోట్లుగా నిర్ణయించారు. ఇక సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీషా తదితరులు బేస్ ధర రూ.75 లక్షలుగా నిర్ణయించారు. అయితే గత సీజన్ లో రూ.24.50 కోట్ల ధర పలికిన మిచెల్ స్టార్క్ నేడు రూ. 2కోట్లతో వేలంలోకి వస్తున్నాడు. ఇక టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు (704) పడగొట్టిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అండర్సన్ ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తితో ఉన్నారు. తను రూ.1.25 కోట్ల కనీస ధరతో వేలంలోకి వస్తున్నాడు. అయితే టీ 20లు తనెక్కువ ఆడలేదు. 44 గా మాత్రమే ఆడి 41 వికెట్లు పడగొట్టాడు. అయితే ముంబై మాత్రం అయిదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ, తిలక్ వర్మ‌లను అట్టిపెట్టుకుంది. ఈ ఆటగాళ్ల కోసం రూ. 75 కోట్లు ఖర్చుపెట్టింది. దీంతో వేలంలో రూ.45 కోట్లతో బరిలోకి దిగుతోంది.

Exit mobile version