Site icon Prime9

World Athletics: ట్రాన్స్‌జెండర్ మహిళలపై నిషేధం విధించిన ప్రపంచ అథ్లెటిక్స్

World Athletics

World Athletics

World Athletics: ప్రపంచ అథ్లెటిక్స్ అంతర్జాతీయ ఈవెంట్లలో మహిళా విభాగంలో ట్రాన్స్ జెండర్ మహిళలను పోటీ చేయకుండా నిషేధించింది. ఇది ఇతర అథ్లెట్లకు టెస్టోస్టెరాన్ పరిమితులను కూడా కఠినతరం చేసింది.ప్రపంచ అథ్లెటిక్స్ ప్రెసిడెంట్ సెబాస్టియన్ కో మాట్లాడుతూ యుక్తవయస్సు దాటిన లింగమార్పిడి అథ్లెట్లు మార్చి 31 నుండి మహిళా ప్రపంచ ర్యాంకింగ్ పోటీలలో పాల్గొనడానికి అనుమతించబడరు. ట్రాన్స్ మహిళా అథ్లెట్లను మినహాయించాలనే నిర్ణయం మహిళలను రక్షించడం చాలా అవసరం అని ఆయన అన్నారు.

టెస్టోస్టెరాన్ స్దాయిపై నిబంధనలు..(World Athletics)

సెక్స్ డెవలప్‌మెంట్‌లో తేడాలు (DSD) ఉన్న అథ్లెట్‌ల కోసం గరిష్ట ప్లాస్మా టెస్టోస్టెరాన్ మొత్తాన్ని సగానికి తగ్గించాలని పాలకమండలి మండలి ఓటు వేసింది. అంతకుముందు నియమాల ప్రకారం ప్రపంచ అథ్లెటిక్స్‌లో లింగమార్పిడి స్త్రీలు తమ బ్లడ్ టెస్టోస్టెరాన్ మొత్తాన్ని లీటరుకు గరిష్టంగా 5 నానోమోల్స్‌కు తగ్గించుకోవాలి.మహిళా విభాగంలో పోటీ చేయడానికి ముందు 12 నెలల పాటు నిరంతరంగా ఈ థ్రెషోల్డ్‌లో ఉండాలి.ఇప్పుడు DSD అథ్లెట్లు పోటీ చేయడానికి అన్ని ఈవెంట్‌లలో కనీసం 24 నెలల పాటు లీటరుకు 2.5 నానోమోల్‌ల రక్త టెస్టోస్టెరాన్ స్థాయిని కలిగి ఉండాలి. ఇది మునుపటి కంటే రెట్టింపు ఉండటం గమనార్హం.

లింగమార్పిడి అథ్లెట్లు కూడా 24 నెలల పాటు లీటరుకు 2.5 నానోమోల్స్ కంటే తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలను నిర్వహిస్తే, మహిళా విభాగంలో పోటీ పడేందుకు అనుమతించే ఆలోచనను వరల్డ్ అథ్లెటిక్స్ గతంలో రూపొందించింది. కానీ ఆ ప్రతిపాదనకు క్రీడలో తక్కువ మద్దతు ఉందని స్పష్టమైంది.కొత్త మార్పులను ప్రకటించిన సెబాస్టియన్ కో, ట్రాన్స్ ఇన్‌క్లూజన్ సమస్యను మరింత అధ్యయనం చేయడానికి 12 నెలల పాటు వర్కింగ్ బాడీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికి ట్రాన్స్‌జెండర్ అథ్లెట్ అధ్యక్షత వహిస్తారని ఆయన తెలిపారు.మాకు తగినంతగా తెలియదు, ఇప్పుడు మనం మరింత తెలుసుకోవాలి.దాని ఆధారంగా మహిళా వర్గాన్ని రిస్క్ చేయడానికి మేము సిద్ధంగా లేమని కో చెప్పారు.

కఠినమైన టెస్టోస్టెరాన్ పరిమితులు అనేక మంది DSD అథ్లెట్లపై ప్రభావం చూపుతాయి, ఇందులో రెండుసార్లు ఒలింపిక్ 800 మీటర్ల ఛాంపియన్ కాస్టర్ సెమెన్యా, 2020 ఒలింపిక్ రజత పతక విజేత క్రిస్టీన్ మ్బోమా మరియు 2016 ఒలింపిక్స్‌లో సెమెన్యాతో రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్సిన్ నియోన్‌సబా ఉన్నారు.లింగమార్పిడి స్త్రీలు మగ యుక్తవయస్సులో ఏదైనా భాగాన్ని అనుభవించినట్లయితే అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనకుండా నిషేధించాలని జూన్ 2022లో పాలకమండలి ఓటు వేసింది.

Exit mobile version