China: ఈ కౌగిలింత చాలా కాస్ట్లీ గురూ..

చైనాలో ఓ ఉద్యోగికి కౌగిలింత ఖరీదైన వ్యవహారంగా మారింది. తన సహోద్యోగిని కౌగలించుకోవడంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. తన కోలిగ్‌ గట్టిగా కౌగిలించుకోవడం వల్ల తన పక్కటెములు పటపటమంటూ విరిగాయని ఆమె కోర్టుకు విన్నవించింది.

  • Written By:
  • Publish Date - August 19, 2022 / 08:14 PM IST

China: చైనాలో ఓ ఉద్యోగికి కౌగిలింత ఖరీదైన వ్యవహారంగా మారింది. తన సహోద్యోగిని కౌగలించుకోవడంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. తన కోలిగ్‌ గట్టిగా కౌగిలించుకోవడం వల్ల తన పక్కటెములు పటపటమంటూ విరిగాయని ఆమె కోర్టుకు విన్నవించింది. తనకు మెడికల్‌ బిల్లు చెల్లించేలా ఆదేశాలివ్వాలని సదరు యువతి కోర్టును విన్నవించుకుంది. దానిపై విచారణ జరిపి కోర్టు సదరు ఉద్యోగి బలంగా కౌగలించుకున్నందు వల్లే యువతి పక్కటెముకలు విరిగాయని నిర్ధారించింది. కాబ్టటి బాధితురాలికి వెంటనే పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

చైనాలోని హనన్‌ ప్రావెన్స్‌లో గత ఏడాది ఈ ఘటన జరిగింది. ఆఫీసులో తన కోలిగతో మాట్లాడుతుండగా.. మరో సహోద్యోగి ఆమె వద్దకు వచ్చి గట్టిగా కౌగలించకున్నాడు. అతను బలమంతా ప్రయోగించి హగ్‌ చేసుకోవడంతో బాధతో విలవిల్లాడిపోయింది. తర్వాత చాతీలో నొప్పి అనిపించడంతో చిట్కాలు పాటించినా ప్రయోజనం లేకపోయింది. రోజులు గడిచినా నొప్పి తగ్గకపోవడంతో ఎక్స్‌రే తీయిచుకుంది సదరు మహిళా ఉద్యోగి. ఎక్స్‌ర్‌ చూసిన డాక్టర్లు కుడివైపున రెండు, ఎడమ వైపున ఒక పక్కటెముక విరిగినట్లు గుర్తించారు. చికిత్స తర్వాత కొన్ని నెలల పాటు రెస్టు తీసుకోవాల్సి వస్తుందని డాక్టర్‌ సలహా ఇచ్చారు. సెలవు పెట్టడంతో జీతం కోల్పోవడంతో పాటు వైద్య ఖర్చులు తడిసిమోపెడయ్యాయి.

డబ్బుకు డబ్బు. ఆరోగ్యానికి ఆరోగ్యం దెబ్బతినడంతో సహోద్యోగి చేసిన నిర్వాకానికి బాగా నష్టపోయానని భావించింది. వెంటనే స్థానిక కోర్టును ఆశ్రయించి జరిగిన నష్టాన్ని వవరించింది సదరు మహిళ. కోర్టు విచారణ జరిపి సహోద్యోగికి పది వేల యూవాన్లు, భారతీయ కరెన్సీ ప్రకారం అక్షరాలా లక్షా 20 వేలు చెల్లించాలని హుకుం జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుతో ఉద్యోగి లబోదిబోమన్నాడు. తన సహోద్యోగి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని పక్కటెముకలు విరిగిపోయేలా తాను కౌగలించుకోలేదని మొత్తుకున్నా, అదేమీ కుదరుదు పరిహారం చెల్లించాల్సిందే అంటూ కోర్టు ఆదేశాలివ్వడంతో చేసేది లేక నష్టపరిహారం చెల్లించాడు. సహోద్యోగి కౌగిలింత చాలా ఖరీదైంది గురు అంటూ తన దురదృష్టాన్ని నిందిచుకున్నాడు సదరు ఉద్యోగి.