Site icon Prime9

Uzbekistan : మేడ్‌ ఇన్‌ ఇండియా దగ్గు మందు తాగి 18 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.. ఉబ్జెకిస్తాన్‌

syrup

syrup

Uzbekistan : భారతీయ ఫార్మా కంపెనీ తయారు చేసిన దగ్గు మందు తాగి 18 మంది చిన్నారులు మృతి చెందారని ఉబ్జెకిస్తాన్‌కు చెందిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. కాగా ఈ దగ్గముందును తయారు చేసిన కంపెనీ పేరు మారియన్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. 2012లో ఉజ్బెకిస్తాన్‌లో రిజిష్టరు చేయబడింది. ఉబ్జెకిస్తాన్‌కు చెందిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల చేసిన ప్రకటన ప్రకారం …డాక్‌-1 మాక్స్‌ సిరప్‌ తాగిన చిన్నారులు మృత్యువాతపడ్డారని తెలియజేసింది. కాగా ఇండియాలోని నోయిడాకు చెందింది మారియన్‌ బయోటెక్. ఇప్పటి వరకు 21 మంది పిల్లలకు గాను 18 మంది పిల్లలు కన్నుమూశారు. దగ్గుమందు తాగిన వెంటనే శ్వాసతీసుకోవడంతో ఇబ్బందులు ఎదురై మరణించారని వైద్య ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటనలో వివరించింది.

ఈ చిన్నారులను ఆస్పత్రిలో చేర్పించడానికి ముందు మారియన్‌ బయోటెక్‌కు చెందిన దగ్గుమందు రెండు నుంచి ఏడు రోజుల పాటు రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు 2.5 ఎం.ఎల్‌ నుంచి 5 ఎం.ఎల్‌ వరకు పిల్లలతో తాగించారు. కాగా సాధారణంగా ఇవ్వాల్సిన మోతాదు కంటే ఈ దగ్గు మందు ఎక్కువగా ఇచ్చినట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. కాగా ఈ దగ్గు మందు డాక్‌ – 1 మాక్స్‌ సిరప్‌లో ప్రధానమైన కీలకమైన ఔషధం పారాసెట్‌మల్‌. కాగా పిల్లల తల్లిదండ్రులు ఈదగ్గు ముందును జలుబు కోసం లేదా ఫార్మా కంపెనీ సూచనల మేరకు వాడారో తెలియదని ప్రకటనలో పేర్కొంది. మొత్తానికి డాక్‌ -1 మాక్స్‌ సిరప్‌ తాగించడం వల్ల పిల్లల ఆరోగ్యం క్రమంగా క్షీణించిందని ప్రకటనలో వివరించింది.

ప్రాథమిక లేబరేటరీ పరీక్షల్లో డాక్‌ -1 మాక్స్‌ సిరప్‌లో ఎథిలెన్‌ గ్లైకోల్‌ మోతాదు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కాగా ఈ ఎథిలెన్‌ గ్లైకోల్‌ విషపూరితమైంది. ఒక కిలోలో 1 నుంచి 2 ఎంఎల్‌ ఉన్నా95 శాతం కాన్సన్‌ట్రేటెడ్‌ సొల్యూషన్‌ వల్ల రోగి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఉదాహరణకు వాంతులు చేసుకోవడం, మూర్చతో పడిపోవడం,గుండెపై ప్రభావం చూపడంతో పాటు కిడ్నీ దెబ్బతినే అవకాశాలున్నాయని ఉజ్బెకిస్తాన్‌ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు.

ఇదిలా ఉండగా దీనికి బాధ్యులైన ఏడుగురు ఉద్యోగులను విధుల్లోంచి తొలగించారు. తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈ చర్య తీసుకుంది. దీంతో పాటు కొంత మంది స్పెషలిస్టులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న ఫార్మసీ కౌంటర్‌ నుంచి డాక్‌ -1 మాక్స్‌ దగ్గుమందును తొలగించారు. డాక్టర్లు కూడా ఈ మందును ప్రిస్క్రైబ్ చేయకుండా ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా తల్లిదండ్రులు పిల్లల మందు కొనుగోలు చేయడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని … డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మందులు కొనుగోలు చేయాలని సూచించింది.

Exit mobile version