Site icon Prime9

US varsities: ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం చేసేలోపు రావాల‌ని విద్యార్థులకు ఆదేశాలు.. తెలుగు విద్యార్థుల్లో మొదలైన టెన్షన్‌

US varsities urge foreign students to return to campus ahead of Trump’s swearing-in: సెలవుల కోసం స్వదేశానికి వెళ్లిన విద్యార్థులు వెంటనే అమెరికాకు తిరిగి రావాలని యూనివ‌ర్సిటీలు మెసేజ్‌లు పంపాయి. దీంతో అమెరికాలో చదువుతున్న తెలుగు విద్యార్థుల్లో టెన్షన్‌ వాతావరణం మొదలైంది. అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికలు ఇటీవల నిర్వహించారు. ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం చేసే లోపు విద్యార్థులు తిరిగి రావాల‌ని ఆదేశించాయి.

టికెట్లు బుక్ చేసుకుంటున్న విద్యార్థులు..
అమెరికా వెళ్లేందుకు విద్యార్థులు టికెట్లు కూడా బుక్ చేసుకుంటున్నారు. వ్యాలిడ్ వీసా ఉన్నా కూడా రిస్క్‌ తీసుకోవడానికి తెలుగు విద్యార్థులు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఈ నెలలో ఇండియా, అమెరికా విమానాలు దాదాపు ఫుల్ అయ్యాయి. 2016 సంవత్సరంలో చాలా మంది విదేశీ విద్యార్థులను ట్రంప్ వెనక్కి పంపించారు. దీంతో తెలుగు విద్యార్థుల్లో హడావుడి మొదలైంది.

జ‌న‌వ‌రి 20న ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం
47వ అమెరికా అధ్య‌క్షుడిగా డోనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 20న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. మొద‌టి రోజు కీలక నిర్ణయాలు తీసుకోకున్నట్లు సమాచారం. ఆర్థికం, ఇమ్మిగ్రేష‌న్ లాంటి అంశాల‌పై సంత‌కం చేసే అవకాశం ఉంది. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు. కొత్త విధానాలు తీసుకువస్తే ట్రావెల్, వీసా ప్రాసెసింగ్‌లో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో విదేశీ విద్యార్థులు, స్టాఫ్‌కు అమెరికా వ‌ర్సిటీలు ఆదేశాలు ఇచ్చాయి. అమెరికాలో 54 శాతం భారత్, చైనాకు చెందిన విద్యార్థులు ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి. తాజాగా నివేదికల ప్రకారం అగ్రస్థానంలో భారత విద్యార్థులు ఉన్నట్లు యూస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ డోర్స్ 2024 నివేదిక తెలిపింది.

Exit mobile version