Site icon Prime9

Mike Pompeo: అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోకు కేంద్రమంత్రి జై శంకర్ కౌంటర్.. దేనిగురించో తెలుసా?

Mike Pompeo

Mike Pompeo

Mike Pompeo : అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో సుష్మా స్వరాజ్‌పై చేసిన వ్యాఖ్యలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కొట్టిపారేశారు.

తన ప్రత్యర్థి సుష్మా స్వరాజ్‌ను ముఖ్యమైన రాజకీయ నేతగా  తాను ఎప్పుడూ చూడలేదని మైక్ పాంపియో చెప్పడాన్ని జైశంకర్ తప్పుబట్టారు.

సుష్మాస్వరాజ్ ముఖ్యనేతకాదు..మైక్ పాంపియో

 

తన తాజా పుస్తకం ‘నెవర్ గివ్ ఏ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్’లో, పాంపియో సుష్మా స్వరాజ్‌ని అమెరికా యాస పదాలు ఉపయోగించి కొంత అవమానకరంగా వర్ణించాడు.

భారతదేశ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ముఖ్యనేతకాదు. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు మరియు నమ్మకమైన

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో చాలా సన్నిహితంగా పనిచేశాను అంటూ 59 ఏళ్ల పాంపియో తన పుస్తకంలో రాశారు.

సెక్రటరీ పాంపియో పుస్తకంలో శ్రీమతి సుష్మా స్వరాజ్ జీని ప్రస్తావిస్తూ నేను ఒక భాగాన్ని చూశాను. నేను ఎల్లప్పుడూ ఆమెను గొప్పగా గౌరవిస్తాను .

ఆమె కోసం ఉపయోగించిన అగౌరవమైన వ్యవహారికతను నేను ఖండిస్తున్నాను అంటూ జై శంకర్ వ్యాఖ్యానించారు.

పాంపియో తన పుస్తకంలో జై శంకర్ గురించి కూడ కామెంట్లు చేసారు. నా రెండవ భారతీయ సహచరుడు సుబ్రహ్మణ్యం జైశంకర్. భారతదేశం యొక్క కొత్త విదేశాంగ మంత్రిగా “J”ని స్వాగతించాము. నేను

ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నాను. అతను మాట్లాడే ఏడు భాషలలో ఇంగ్లీష్ ఒకటి. అతనిది నా కంటే కొంత మెరుగైనది అంటూ రాసారు.

సుష్మా స్వరాజ్ మోదీ ప్రభుత్వంలో మే 2014 నుండి మే 2019 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు.

ఆమె ఆగస్టు 2019లో మరణించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నమ్మకస్థుడైన పాంపియో 2017 నుండి 2018 వరకు  CIA డైరెక్టర్‌గా ఉన్నారు .

2018 నుండి 2021 వరకు విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు

పాకిస్తాన్ అణుదాడికి సిద్దమవుతోందని చెప్పారు.. మైక్ పాంపియో

2019 ఫిబ్రవరిలో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో పాకిస్థాన్ అణుదాడికి సిద్ధమవుతోందని సుష్మా స్వరాజ్

తనకు తెలియజేశారని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పేర్కొన్నారు. .

పోంపియో చెప్పినదాని ప్రకారం US-నార్త్ కొరియా సమ్మిట్ కోసం హనోయిలో ఉన్నప్పుడు ఫిబ్రవరి 27-28, 2019 న ఈ సంఘటన జరిగింది.

అతని సిబ్బంది ఈ సంక్షోభాన్ని తగ్గించడానికి న్యూ ఢిల్లీ మరియు ఇస్లామాబాద్ రెండింటితో కలిసి రాత్రి అంతా సంభాషించారు

ఫిబ్రవరి 2019లో భారతదేశం-పాకిస్తాన్ శత్రుత్వం అణు జ్వాలగా మారడానికి ఎంత దగ్గరగా వచ్చిందో ప్రపంచానికి సరిగ్గా తెలియదని నేను అనుకోను.

ఇది చాలా దగ్గరగా ఉందని నాకు తెలుసు అంటూ పాంపియో తన పుస్తకంలో రాశారు.

 

 మైక్ పాంపియో  తన పుస్తకంలో ఏమి  రాసారు?

 

నేను వియత్నాంలోని హనోయ్‌లో ఉన్న రాత్రిని నేను ఎప్పటికీ మరచిపోలేను.

 

ఉత్తర కొరియన్లతో అణ్వాయుధాలపై చర్చలు జరుగుతుండా భారతదేశం మరియు పాకిస్తాన్ ఒకరినొకరు బెదిరించడం ప్రారంభించాయని పోంపియో పేర్కొన్నారు.

 

తన హోటల్‌లోని చిన్న సురక్షిత కమ్యూనికేషన్ సదుపాయంలో తనతో పాటు ఉన్న అంబాసిడర్, అప్పటి జాతీయ భద్రతా సలహాదారు

 

జాన్ బోల్టన్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించానని పాంపియో పేర్కొన్నారు.

 

భారత్, పాక్ లు ఒకరినొకరు అనుమానించాయి.. మైక్ పాంపియో

 

నేను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ (కమర్ జావేద్) బజ్వా వద్దకు చేరుకున్నాను. భారతీయులు నాకు చెప్పినది నేను అతనికి చెప్పాను.

 

అది నిజం కాదని అతను చెప్పాడు. భారతీయులు తమ అణ్వాయుధాలను మోహరించడానికి సిద్ధమవుతున్నారని అతను నమ్మాడు.

 

న్యూ ఢిల్లీ మరియు ఇస్లామాబాద్‌లోని మా బృందాలు వీరిద్దరు ఒకరితొమరొకరు అణు యుద్ధానికి సిద్ధపడటం లేదని

 

ప్రతి పక్షాన్ని ఒప్పించటానికి, అద్భుతంగా పని చేశాయంటూ పాంపియో రాసారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version
Skip to toolbar