Trump-Zelenskyy clash in White House: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన మొదటినుంచే ఉక్రెయిన్‌కు అమెరికా అండగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్.. ఆ దేశానికి నిధులు, యుద్ధ సామగ్రిని సమకూర్చింది. దీంతో ఉక్రెయిన్.. రష్యా దేశానికి ధీటుగా బదులిచ్చింది. అయితే ఇటీవల అమెరికాలో జరిగిన ఎన్నికల్లో బైడెన్ ఘోరంగా ఓటమి చెందారు. దీంతో రాజకీయాలు తారుమారైపోయాయి. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. ఉక్రెయిన్‌కు నిధులు ఆపేశారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం రావడానికి జెలెన్‌స్కీ ప్రధాన కారణమని మీడియా ఎదుటే ట్రంప్ ఆరోపించారు. అనంతరం యూఎస్ పర్యటనలో ఉణ్న జెలెన్‌స్కీని మీడియా ముందే తిట్టిపోశారు. ఈ మేరకు ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దీంతో ఇరుదేశాల మధ్య ఒప్పందంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే ఖనిజాల ఒప్పందం కోసం అమెరికాతో చర్చించేందుకు జెలెన్‌స్కీ వచ్చారు. కానీ ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయలేదు. దీంతో వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ భేటీ అర్ధాంతరంగా ముగిసింది. ఈ ఒఫ్పందం కోసమే వచ్చిన జెలెన్‌స్కీ.. అది పూర్తవకుండానే వైట్‌హౌస్ నుంచి వెళ్లిపోయారు.
కాగా, వైట్‌హౌస్ నుంచి బయటకు వెళ్లిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్వీట్ చేశారు. ‘ధన్యవాదాలు అమెరికా. మీ మద్దతు ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలు ప్రెసిడెంట్. ఉక్రెయిన్ దేశానికి శాశ్వత శాంతి కావాలి. మేం అందుకోసమే పనిచేస్తున్నాం. మా దేశంలో మేం ఉంటున్నాం. అని రాసుకొచ్చారు. అయితే, అంతకుముందు ట్రంప్.. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని అనుకోవడం లేదని, జెలెన్‌స్కీ శాంతిని కోరుకోవడం లేదని ట్రంప్ ఆరోపణలు చేశాడు.
అంతేకాకుండా, జెలెన్‌స్కీతో జరిగిన ఘర్షణపై ట్రంప్ స్పందించారు. వైట్ హౌస్ బయట మీడియాతో మాట్లాడారు. అమెరికా దేశాన్ని జెలెన్‌స్కీ అవమానించారన్నారు. ఎప్పుడైతే ఆయన శాంతి స్థాపనకు సిద్ధపడతారో అప్పుడే మళ్లీ ఇక్కడికి వస్తారని పేర్కొన్నారు. అయితే ఈ వాగ్వాదాన్ని యూఎస్ ఉపాధ్యక్షుడు వాన్స్ తప్పుబట్టారు. మీడియా ఎదుట తమ అధ్యక్షుడిని అగౌరవపరిచారని మండిపడ్డారు.