Cyclone Chido: మరో తుఫాను బీభత్సం.. వణికిపోతున్న మాయోట్

Thousands Feared Dead As Cyclone Chido: ఫ్రెంచ్ భూభాగంంలో మరో తుఫాను బీభత్సం సృష్టించింది. హిందూ మహాసముద్రంలోని మాయోట్ ద్వీపంలో ఛీడో తుఫాను సృష్టించింది. ఈ తుఫానులో ఇప్పటివరకు 11 మంది మరణించగా.. మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

ఈ తుఫాను బీభత్సంలో దాదాపు 300 మందికి పైగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. మయోట్ ద్వీపంలో గడిచిన 90ఏళ్లల్లో ఇటువంటి తుఫాను చోటుచేసుకోవడం ఎపుడూ చూడలేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛీడో తుఫాన గంటకు 220కి.మీ కంటే అంతకంటే ఎక్కువ వేగంతో తీవ్రమైన గాలులు వీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఈదురుగాలుల వేగానికి పలు ఇళ్లు, రోడ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ బీభత్సంలో పెద్దమొత్తంలో ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

మయో‌ట్‌లో ఛీడో తుఫాను తుడిచిపెట్టింది. ఆగ్నేయా హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఈ భారీ తుఫాను కారణంగా మయోట్ భారీగా నష్టపోయింది. పక్కనున్న కొమోరోస్, మడగాస్కర్ ద్వీపాలపై ఛీడో ప్రభావం చూపింది. ఈ తుఫాన్ ప్రభావానికి మయోట్ నగరం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. పలుచోట్ల పైకప్పులు కూలిపోవడంతో శిథిలాలు కింద ఎంతమంది చిక్కుకున్నారో తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు.

ఈ తుఫాను కారణంగా వేలాది కార్లు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా భయంకరమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. రష్యాకు చెందిన రెండు భారీ నౌకలు సముద్రంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెలువడించలేదు. మరోవైపు, తుఫాను ధాటికి మయోట్ భారీగా నష్టపోయిందని, తమను ఆదుకోవాలని ఆ దేశ ప్రధాని కోరారు.

కాగా, రాకాసి తుఫాను బీభత్సానికి 1000 మందికిపైగా చనిపోయి ఉంటారని తెలుస్తోంది. ఈ మయోట్ ద్వీపంలో దాదాపు 3 లక్షలకుపైగా జనాభా నివసిస్తోందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.