Site icon Prime9

US Attacks : యెమెన్‌పై విరుచుకుపడ్డ అమెరికా యుద్ధవిమానాలు.. 50 లక్ష్యాలు ధ్వంసం.. 80 మంది మృతి

US Attacks

US Attacks

US Attacks : యెమెన్‌‌పై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. యూఎస్ యుద్ధ విమానాలు యెమెన్‌ రాజధాని సనాపాటు పలు నగరాలపై బాంబులతో విరుచుకుపడ్డాయి. అమెరికా యుద్ధ విమానాలు యెమెన్‌లో దాదాపు 50 లక్ష్యాలను ధ్వంసం చేశాయి. సనా, హోదైద, అమ్రాన్‌ నగరాలపై బాంబులు జార విడిచినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి ఈ దాడులు జరిగాయి.

 

పోర్టు, విమానాశ్రయం ధ్వంసం..
దాడుల్లో హోదైదలోని పోర్టు, విమానాశ్రయం ధ్వంసమైనట్లు హూతీలు చెబుతున్నారు. తమ దాడులు ఏ మాత్రం ఆగవని యూఎస్ సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది. కొన్ని రోజుల కింద అగ్రరాజ్యం అమెరికా ఎర్ర సముద్రంలో నౌకాశ్రయంపై చేసిన దాడుల్లో 70 మంది మృతిచెందారు. దాదాపు 171 మంది గాయపడ్డారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇదే అత్యంత తీవ్రమైంది.

 

ఐరాస ప్రధాన కార్యదర్శి స్పందన..
దాడిపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ స్పందించారు. దాడులు చేయడం ఆందోళనకరం అన్నారు. హూతీ రెబల్స్‌ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఆదేశించడంతో దాడులు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.

 

 

Exit mobile version
Skip to toolbar