Site icon Prime9

World Dirtiest Man: ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి కన్నుమూసాడు..

dirtiest man

dirtiest man

Iran: దశాబ్దాలుగా స్నానం చేయని కారణంగా ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి అని పేరుగాంచిన ఇరాన్ వ్యక్తి 94 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. అర్ధ శతాబ్దానికి పైగా ఒంటరిగా ఉన్న అమౌ హాజీ, దక్షిణ ప్రావిన్స్ ఫార్స్‌లోని డెజ్‌గా గ్రామంలో ఆదివారం మరణించాడు.

హాజీ “అనారోగ్యానికి గురవుతాననే భయంతో దశాబ్దాల తరబడి స్నానం చేయడం మానేసాడు. కానీ కొన్ని నెలల క్రితం మొదటిసారిగా, గ్రామస్తులు అతడిని బలవంతంగా బాత్రూమ్ కు తీసుకువెళ్లి స్నానం చేయించారు. 2013లో అతని జీవితం పై “ది స్ట్రేంజ్ లైఫ్ ఆఫ్ అమౌ హాజీ” అనే చిన్న డాక్యుమెంటరీ చిత్రం రూపొందించబడింది.

Exit mobile version