Prime9

Ahmed Sharif Chaudhry: ఉగ్రవాది కుమారుడే ఈ పాక్ అధికారి.. బిన్ లాడెన్ కు సన్నిహితుడు!

Pakistan Army Spokes Person Ahmed Sharif Chaudhry is Terrorist Son: ఉగ్రవాదులే పాకిస్థాన్ ఆర్మీని నడిపిస్తున్నారనడానికి తాజా సాక్షాలు లభించాయి. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా, భారత్ పాక్ యుద్ద సమయంలో  మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చిన అధికారే ఉగ్రవాది కుమారుడు. అతనే, పాకిస్థాన్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి. ఇతను పాకిస్థాన్ అను శాస్త్రవెత్త సుల్తాన్ బషీరుద్దీన్ మహమూద్ కుమారుడు. బషీరుద్దీన్ కు ఒసామా బిన్ లాడెన్ కు దగ్గరి సంబధం ఉంది. అప్పట్లో, అణ్వాయుధ సాంకేతికతను ఉగ్రవాదులకు అందించడానికి బషీరుద్దీన్ ప్రయత్నించాడు. దీంతో అతన్ని UNభద్రతా మండలి యొక్క ఉగ్రవాదుల జాబితాలో ఉంచారు.

 

ఉగ్రవాద బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి కుమారుడికి పాకిస్థాన్ ఆర్మీలో అత్యున్నత పదవిలో ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది. షరీఫ్ చౌదరి ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) లెఫ్టినెంట్ జనరల్ గా ఉన్నాడు. పహల్గాం ఉగ్రదాడిపై భారత్ యుద్ధం చేస్తుండగా, ఉగ్రవాదులను అనచడమే ఈ యుద్ధానికి కారణమైనప్పుడు, అదే పాకిస్థాన్ ఓ ఉగ్రవాద బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తిని ఆర్మీలోకి తీసుకోవడమే కాకుండా అతనిచేతనే ప్రపంచం ముందు బ్రీఫింగ్ ఇప్పించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక రకంగా పాకిస్థాన్ దేశం తాము ఉగ్రవాదులు వేరుకాదని చెబుతోంది. ఇందుకు మరో ఉదాహరణ ఇప్పుడు చెప్పుకుందాం.

 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ లో ఉన్న ఉగ్ర స్థావరాలపై భారత్ దాడిచేసింది. అందులో మరణించిన ఉగ్రవాదులకు ఏకంగా పాకిస్థాన్ ఆర్మీ అధికార సైనిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించింది .  ఉగ్రవాదులకు పాకిస్థాన్ జెండా కప్పి అంత్యక్రియలు నిర్వహించడం, ఆ కార్యక్రమానికి ఆర్మీ అధికారులు హాజరవడం తీవ్రవిమర్శలకు దారితీసింది.

 

ఇదే విషయంపై ప్రపంచ దేశాలు ప్రశ్నించగా, చనిపోయిన ఉగ్రవాదులలో ఆర్మీ అధికారి కుమారుడు ఉన్నాడని అందుకే ఆర్మీ అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారని పాకిస్థాన్ బొంకింది.  పాక్ ఆర్మీ కుమారుడు బాంబు దాడిలో చనిపోయినా, అతని పార్థీవ దేహానికి జాతీయ పథాకం కప్పరు. ఈ విషయంపై కూడా సమాదానం లేదు.

 

దీంతో పాటే ఆర్మీ అధికారి కుమారుడి శవానికి తీవ్రవాదుల శవాలకు ఒకే సారి, ఒకే చోట ఎందుకు అంతిమసంస్కారాలు నిర్వహించారన్న ప్రశ్నకు పాక్ ఆర్మీ అధికారుల దగ్గర జవాబు లేదు. ఈ రెండు ఘటనలే కాకుండా, ఉగ్రవాదులపై భారత్ దాడి చేస్తే పాకిస్థాన్ యుద్దానికి రావడం మరో ఆశ్చర్యం. కాబట్టి అంతిమంగా తేలింది ఏంటంటే. పాకిస్థాన్ ను పాలిస్తున్నది అక్కడి ప్రభుత్వం కాదు ఉగ్రవాదుల కనుసన్నల్లో పాక్ నడుస్తున్నదన్నది  నిజం.

Exit mobile version
Skip to toolbar