Afghanistan: ఆఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేస్తోంది.
మంగళవారం నాడు వివిధ నేరాలకు పాల్పడిన వారికి కందహార్‌లోని ఒక ఫుట్‌బాల్ స్టేడియంలో ప్రజల సమక్షంలో శిక్షలను అమలు చేసింది.
దొంగతనాలకు పాల్పడినతొమ్మిది మంది నిందితులకు బహిరంగంగా కొరడా దెబ్బల శిక్ష అమలు చేయడంతో పాటు మరో నలుగురి చేతులు నరికేశారు.
గవర్నర్ కార్యాలయం అధికార ప్రతినిధి హజీ జెయిద్ దొంగలకు విధించిన శిక్షల గురించి వివరించారు.
వివిధ నేరాలకు గాను ఒక్కొక్కరికి 35 నుంచి 39 కొరడా దెబ్బల శిక్ష విధించామని చెప్పినట్లు సన్‌పత్రిక వెల్లడించింది.
ఈ బహిరంగ శిక్షలు అమలు చేసేటప్పుడు తాలిబన్ అధికారులు, మత గురువులు, పెద్దలు, స్థానిక ప్రజల ముందు ఈ శిక్షలు అమలు చేయడం జరిగింది.
స్టేడియంలోని గడ్డిపై తొమ్మిది నిందితులు శిక్ష కోసం ఎదురుచూస్తున్న చిత్రాలను స్టేడియంకు వచ్చిన ప్రేక్షకులకు పంచిపెట్టారు.
అప్గాన్ జర్నలిస్టు తాజుద్దీన సౌరుష్ స్టేడియంలోని చిత్రాలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
మహిళలపై నిర్బంధం సడలింపు
ఆఫ్గానిస్తాన్(Afghanistan)లో చరిత్ర పునరావృతం అవుతోందన్నారు. 1990 నాటి తాలిబన్ ప్రభుత్వం విధించిన బహిరంగ శిక్షలు తరిగి పున:ప్రారంభమయ్యాయన్నారు.
గత డిసెంబర్‌లో తాలిబన్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక వ్యక్తికి బహిరంగంగా ఉరిశిక్షను అమలు చేశారు.
ఓ వ్యక్తిని హత్య చేసినందుకు తాలిబన్లు నిందితుడికి బహిరంగ శిక్ష అమలు చేశారు. బాధితుడి తండ్రి రైఫిల్‌తో నిందితుడుని కాల్చి చంపాడు.
వందలాది మంది ప్రజల సమక్షంలో.. తాలిబన్ అధికారులు చూస్తుండగా బాధితుడి తండ్రి కాల్చి చంపాడు.
తాలిబన్లు ఆఫ్గానిస్తాన్‌లో మహిళలపై నిర్బంధాన్ని స్వల్పంగా సడలించారు.
తాలిబన్లు హామీ ఇవ్వడంతో పలు స్వచ్చంద సంస్థలు రంగంలోకి దిగాయి.
ముఖ్యంగా మహిళలు హెల్త్ కేర్ రంగంలో పనిచేయడానికి అనుమతించడం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు.
గత నెలలో మహిళా ఎన్‌జీఓలు పనిచేయడానికి వీల్లేదని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
ఇంటర్నేషనల్ రెస్యూ కమిటి .. సేవ్ ది చిల్డ్రన్ తో పాటు కేర్ ఈ వారం నుంచి తమ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాయి.
ముఖ్యంగా హెల్త్‌కేర్‌తో పాటు పౌష్టికాహారంగం రంగంలో వీరు పనిచేస్తున్నారు.
గత నెల తాలిబన్ ప్రభుత్వం స్థానిక, విదేశీ ఎయిడ్‌సంస్థలు మహిళలతో పనిచేయించరాదని ఆదేశాలు జారీ చేసింది.
తదుపరి నోటీలు ఇచ్చే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని వెల్లడించింది.
దీంతో ప్రపంచదేశాల నుంచి ఆఫ్గానిస్తాన్ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది.
ఎయిడ్ వర్కర్స్ ఇస్లామిక్ డ్రస్ కోడ్‌ను అమలు చేయడం లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమ చర్యను సమర్ధించుకుంది తాలిబన్ సర్కార్.
గత వారం మినిస్ట్రీ పబ్లిక్ హెల్త్ మహిళా హెల్త్ వర్కర్లను పనిచేయడానికి అనుమతించింది.
కార్యాలయాల్లో పనిచేసే వారు తిరిగి పనిచేసుకోవడానికి అనుమతించింది. దీంతో ఐఆర్‌సీ తిరిగి తమ కార్యక్రమాలు మొదలుపెట్టింది.
దేశంలోని నాలుగు ప్రావిన్స్‌లో మొబైల్ అండ్ న్యూట్రిషన్ సర్వీసులను ప్రారంభించింది.
ఆఫ్గాన్ ఆరోగ్యశాఖమంత్రి అధికార ప్రతినిధి మాట్లాడుతూ తాము ఆరోగ్యానికి సంబంధించిన కార్యకలాపాల జోలికి పోలేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిబంధనలను ఎయిడెడ్ సంస్థలు అర్ధం చేసుకోవడంలో పొరపాటు జరిగిందని.. తిరిగి వారు హెల్త్ సర్వీసు సేవలను ప్రారంభించారని అన్నారు.
సేవ్ ది చిల్ర్డన్ హెల్త్, న్యూట్రిషన్‌కు సంబంధి తిరిగి తమ కార్యక్రమాలు ప్రారంభించింది.
అయితే తాలిబన్లు చెప్పేది ఏమిటంటే మహిళలను పరిమితి సంఖ్యలో పనిలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
మొత్తానికి తాలిబన్లు ఎయిడ్ సర్వీసులను అనుమతించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.