Sunita Williams and team Return to Earth Safely: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ భూమి మీదకు సురక్షితంగా అడుగుపెట్టారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లతో పాటు మరికొంతమంది ఆస్ట్రోనాట్స్‌తో‘ క్రూ డ్రాగన్ వ్యోమనౌక’ తెల్లవారుజామున 3.27 నిమిషాలకు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో అడుగు పెట్టింది. గతేడాది జూన్ నెలలో సునీతా విలియమ్స్ వెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్‌లో సమస్యలు తలెత్తడంతో అక్కడే ఉండిపోయారు. మళ్లీ తిరిగి రావడానికి దాదాపు 9 నెలల పాటు సమయం పట్టింది. వీరు మంగళవారం భూమి వైపునకు తిరిగి వచ్చేందుకు క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో 17 గంటలపాటు ప్రయాణించారు.
అంతరిక్షంలో 9 నెలల పాటు ఉండటంతో సునీతా విలియమ్స్ తో పాటు మిగతా వ్యోమగామిల ఆరోగ్యం దిబ్బతినే ప్రమాదం ఉంది. ఈ మేరకు వీరిని ఆరోగ్య పరిస్థితుల నిమిత్తం హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించినట్లు నాసా తెలిపింది. అక్కడే అందరికీ డాక్టర్ల బృంద్ వైద్య పరీక్షలు చేశారు. అంతరిక్షం నుంచి వచ్చిన అందరూ ఆరోగ్యంగా ఉన్నారని నాసా వెల్లడించింది. అంతేకాకుండా అన్ డాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుకున్నట్లుగానే జరిగిందని నాసా తెలిపింది. స్పేస్ ఎక్స్, నాసా సమిష్టి కృషితో నలుగురిని భూమిపైకి తిరిగి తీసుకొచ్చామని, ఈ విజయంల స్పేస్ ఎక్స్ కీలకపాత్ర పోషించిందని నాసా ప్రశంసల వర్షం కురిపించింది. కాగా, ఈ యాత్రలో సునీతా విలియమ్స్ రెండు సార్లు స్పేస్ వాక్ చేసింది.