Site icon Prime9

Somalia:సోమాలియాలో ఆత్మాహుతి బాంబు దాడి.. 18 మంది మృతి..

Somalia

Somalia

 Somalia: సోమాలియాలోని బెలెడ్‌వేన్ నగరంలోని భద్రతా తనిఖీ కేంద్రం వద్ద జరిగిన బాంబు దాడిలో కనీసం 18 మంది మరణించగా 40 మంది గాయపడ్డారు. చెక్‌పాయింట్ వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం పేలడంతో దాదాపు 40 మంది గాయపడ్డారు. ఇది ఆత్మహుతి దాడిగా భావిస్తున్నారు.

అల్-షబాబ్‌పై సోమాలియా యుద్దం..( Somalia)

హిరాన్ ప్రాంతంలోని బెలెడ్‌వేన్ పట్టణంలో పేలుడు సంభవించిన తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తులను మృతదేహాలను వెలికితీసి, రక్షించేందుకు అత్యవసర సిబ్బంది బుల్డోజర్లను ఉపయోగించారు.హిరాన్ గవర్నర్ అబ్దుల్లాహి అహ్మద్ మాలిమ్ సంఘటనా స్థలంలో మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ జరిగినది హేయమైన చర్య.ఇది మొత్తం ప్రాంతాన్ని నాశనం చేసిందని అన్నారు. ఇస్లామిక్ తీవ్రవాదులు ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి 15 సంవత్సరాలుగా తిరుగుబాటు చేస్తున్నారు. అయితే బాంబు దాడికి బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు. సోమాలియా దళాలు గత ఏడాది ఆగస్టులో సెంట్రల్ సోమాలియాలో అల్-ఖైదా అనుబంధ అల్-షబాబ్‌పై దాడిని ప్రారంభించాయి.సోమాలియా ప్రభుత్వం గత సంవత్సరం అల్-షబాబ్‌కు వ్యతిరేకంగా యుద్ధం’ప్రారంభించింది, ఇది మధ్య మరియు దక్షిణ సోమాలియాలోని కొన్ని భాగాలను నియంత్రిస్తుంది. నివాసితులపై పన్నువిధించడం. దోపిడీలకు పాల్పడటం ద్వారా మిలియన్ల డాలర్లను సంపాదించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో దాడులు జరిపిన అల్-షబాబ్ తీవ్రవాద గ్రూపు ముప్పును ఎదుర్కొనేందుకు ప్రజలు నిలబడాలని అధ్యక్షుడు హసన్ షేక్ మొహమూద్ ప్రజలను ప్రోత్సహించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర్భయ దాడులు జరిపిన అల్-షబాబ్ తీవ్రవాద గ్రూపు ముప్పును ఎదుర్కొనేందుకు ప్రజలు నిలబడాలని అధ్యక్షుడు హసన్ షేక్ మొహమూద్ ప్రజలను ప్రోత్సహించారు. ప్రభుత్వ వైఖరి ఒక దశాబ్దంలో అత్యంత ముఖ్యమైన దాడిగా పరిగణించబడుతుంది.

Exit mobile version